నష్టపరిహారం ఇవ్వం...! ఇన్స్యూరెన్స్ డబ్బులు మాత్రమే ఇస్తాం : మెట్రో అధికారులు

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో మౌనిక మృతికి కారణమైన మెట్రో అధికారులు ఇంకా తమ మొండి వైఖరి మాత్రం వీడడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతికి కనీసం నష్టపరిహారం చెల్లించి, మానవత్వం చూపించేందుకు కూడ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మౌనిక మృతికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులకు మెట్రో అధికారులు మొండి చేయి చూపించారు. కేవలం ఇన్యూరెన్స్ ద్వార వచ్చే డబ్బులు మాత్రమే చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం యాబై లక్షల రుపాయలతోపాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అమీర్‌పేట్ మెట్రో మృతి సంఘటన జరిగి గంటలు గడుస్తున్న మెట్రో మరియు ఎల్ అండ్ టి అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో మౌనిక కుటుంబ సభ్యులు బేగంపేట్‌లో‌ని మెట్రో ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు పలు ప్రజా సంఘాల మద్దతు కూడ లభించింది.. దీంతో దిగివచ్చిన మెట్రో అధికారులు కుటుంబ సభ్యులతో చర్చించారు. కాని నష్టపరిహారానికి సంబంధించి ఎలాంటీ హమీ ఇచ్చేందుకు మాత్రం అధికారులు ముందుకు రాలేదు. కేవలం ఇన్సూరెన్స్ ద్వార వచ్చే డబ్బులు మాత్రమే చెల్లిస్తామని అధికారులు పేర్కోన్నారు. అయితే నష్టపరిహారంగా 50 లక్షల రుపాయలతో పాటు ఉద్యోగం కల్పించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Metro officials did not agree to give Compensation for mounikas family

ఇక జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తం చేసిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాత్రం బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు నష్టపరిహరం చెల్లించాలని ఎల్ అండ్ టీ అధికారులను ఆదేశించారు. కాని ఎండీ అదేశాలను పట్టించుకోని ఎల్ అండ్ టి నష్టపరిహారంపై ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+