రాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులు..

ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. సమ్మె దృష్ట్యా ఉదయం అయిదున్నర నుండి అర్థరాత్రి పన్నెండున్నర వరకు సర్వీసులు కొనసాగించనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు, ఆర్టీసీ అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్టీసి కార్మికులు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా పలు నిర్ణయాలు తీసుకుంది.. ఇప్పటికే కార్మీకులను సమ్మె విరమించాలని విజ్ఝప్తి చేసిన కమిటీ అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఆర్టీసీలో ఉన్న 2100 అద్దె బస్సులను నడపుతామని తెలిపారు. ఇందుకోసం తాత్కాలిక పద్దతిన మూడు వేల మంది డ్రైవర్లను భర్తి చేస్తామని చెప్పారు. అత్యవసర నోటిఫికేషన్ ఇచ్చి సిబ్బందిని భర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

metro train timeings extended

ఇక అద్దె బస్సులు కూడ ఆర్టీసీలో అంతర్భగంగా నడుస్తున్న నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు కార్మీకులు ప్రయత్నించే అవకాశాలు ఉండడంతో పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి అద్దె బస్సులో పోలీసులను పెట్టాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 వేల స్కూల్, బస్సులను కూడ రంగంలోకి దింపనున్నారు. మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+