సకల జనుల సమ్మెకు నేటికి 11 ఏళ్లు.. ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న శ్రీనివాస్ గౌడ్
స్వ రాష్ట్ర కాంక్ష నెరవేరేందుకు ఉద్యమకారుల పోరాటం అజరామరం. మలి విడత పోరాటంలో ప్రతీ ఘట్టం ముఖ్యమైనదే. సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చేయడంతో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు నిలిచిపోయాయి. 42 రోజుల పాటు జరిగిన సమ్మె ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటింది.
ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోయాయి. ప్రైవేట్ రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె జరిగి నేటికి సరిగ్గా 11 ఏళ్లు నిండాయి.

2011 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ సమ్మెలో ఉద్యోగ సంఘాల నేతలు కీ రోల్ పోషించారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యమంలో ముందుండి పోరాడారు. సకల జనుల సమ్మెకు 11 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో నాటి ఉద్యమానికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సకల జనుల సమ్మెలో పాల్గొన్న మిత్రులు, ఉద్యమకారులకు ఉద్యమ అభినందనలు తెలిపారు. ఉద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరులైన వీరులకు జోహార్లు తెలిపారు. వారి వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యిందని తెలిపారు.












Click it and Unblock the Notifications