Hyderabad: హిందీకి జైకొట్టిన హైదరాబాదీలు.. !
హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది. ఇక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. రాష్ట్రాల వారే కాదు వివిధ దేశాల వారు కూడా ఉన్నారు. అయితే నగరంలో ఓటీటీ చూసేవారి సంఖ్య పెరుగుంతుందట. అంతే కాదు ఓటీటీలో అత్యధికం హిందీ కంటెంట్ నే ఎక్కువగా చూస్తున్నారని తెలిసింది. హిందీ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత తెలుగు ఉందని ప్రముఖ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్(RMT) అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనానికి సంబంధించిన గణాంకాలను అండర్‌స్టాండింగ్ పెయిడ్ ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ హైదరాబాద్ సోమవారం విడుదల చేసింది. హిందీ కంటెంట్ ను 52 శాతం మంది వీక్షిస్తుండగా.. ఇంగ్లీష్ 28 శాతం, తెలుగు 14 శాతం మాత్రమే చూస్తున్నారని అధ్యయనం చెబుతోంది. 36 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 54 శాతం మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీలో కంటెంట్ చూడాలనుకుంటున్నారని అధ్యయనం పేర్కొంది.

26 సంవత్సరాల లోపు యువత ఓటీటీ కంటెంట్ ను ఒంటరిగా చూడాలనుకుంటున్నారట. ఓటీటీల్లో ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ చూస్తున్నారు. ప్రైమ్ ను 70 శాతం మంది వీక్షిస్తున్నారని నివేదికి పేర్కొంది. హైదరాబాదీలు ప్రతి రోజూ 3 గంటలకు పైగా సమయాన్ని ఓటీటీలో కంటెంట్ చూడడానికి వెచ్చిస్తున్నారు.వీకెండ్ లో ఈ సమయం మరింత పెరుగుతుందని అధ్యయనం చెబుతోంది.
వారాంతాలలో 10 శాతం అదనపు వ్యూయర్‌షిప్ ఉంటుందని అధ్యయనంలో తేలింది. నెలకు రూ.60 వేలకు పైగా ఆదాయం ఉన్న వారిని ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నామని ఆర్ఎంటీ సీఈఓ శ్రీకాంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications