ప్లీనరీలో తలుక్కుమన్న మున్నూరు రవి.. ఎలా వచ్చాడంటే.. కలకలం
టీఆర్ఎస్ ప్లీనరీలో.. విమర్శలు, కౌంటర్ అటాకే కాదు.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ప్లీనరీలో తలుక్కు మన్నాడు. పార్టీ వేడుకకు హాజరై.. పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.
పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్ ఉన్న పాసులు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుకకు హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మున్నూరు రవికి ఈ పాస్ లేకున్నా అతడు పార్టీ ప్లీనరీకి ఎలా హాజరయ్యాడనే విషయంపై పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు రవి పార్టీ వేడుకకు హాజరయ్యాడని ఆ తర్వాత తెలిసింది.

పార్టీ వేడుకలో అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి ఇంకా అక్కడే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ లీడర్లతో మున్నూరు రవి ఫొటోలు దిగారు. పాస్ లేకుండా ఎలా వచ్చాడనే చర్చతో అక్కడి నుంచి రవి వెంటనే వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మున్నూరు రవి వెంటనే డిలీట్ చేశారు. ఏది ఏమైనా మంత్రి హత్యాయత్నం కేసులో నిందితుడు.. పార్టీ ప్రధాన వేడుకకు రావడం కలకలం రేపింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications