హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ఐఏ రైడ్స్: తెలుగు రాష్ట్రాల్లో 48 బృందాల సోదాలు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వివిధ లోకేషన్లలో మొత్తం 48 బృందాలు నిశీతంగా పరిశీలిస్తున్నాయి. దసరా, దీపావళి వేడుకలు సమీపిస్తోన్న వేళ.. ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ చేసింది. పక్కా సమాచారంతోనే రైడ్స్ చేస్తోంది.

నిజామాబాద్, కర్నూల్, గుంటూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. నిజామాబాద్‌లో 23 బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తోంది. ఇటు పొరుగున గల కర్నూలు, కడపలో కూడా 23 బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి.

nia rides at telugu states

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సోదాలు చేస్తోంది. పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు కూడా నమోదు చేశారు. దీంతోపాటు కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు చేస్తున్నారని తెలిసింది.

మతకలహాలు సృష్టించేందుకు ప్రణాళిక రచించారని సమాచారం. మతోన్మాదులకు అతివాదులు శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. ఇటు బైంసా అల్లర్లతో సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరాతీసింది.

English summary
nia rides at telugu states for link of terrorists. officials are rided nizamabad and kurnol, kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X