పెళ్లికానీ జంటలకు నో పర్మిషన్: ఇందిరా పార్క్ వద్ద బ్యానర్ కలకలం..
పార్క్.. ఉద్యానవనం.. పిల్ల, పెద్దలు ఆహ్లాదం కోసం వచ్చే ప్లేస్. ఇప్పుడు ప్రతీ చోట పార్క్ ఉంటుంది. అక్కడ అందరూ ఆటలు ఆడుకుంటారు. ఒక్కో పార్కుకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. అయితే చాలా చోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని వార్తలు గుప్పుమన్నాయి. ఆయా చోట్ల మద్యం తాగుతుంటారని.. శృంగార కార్యకలాపాలకు నెలవు అని చెబుతుంటారు. కానీ వాస్తవంగా పార్కుల్లో అలాంటి కార్యక్రమాలు జరగవని మేనెజ్‌మెంట్ చెబుతోంది.

పెళ్లికానీ జంటలకు..
విషయం ఇలా ఉంటే.. హైదరాబాద్ దోమలగూడ ప్రాంతంలో ఉండే ఇందిరా పార్క్ నిత్యం సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పార్కు తెరిచి ఉంటుంది. ఇందిరా పార్క్ వద్ద తాజాగా కనిపించిన ఓ బ్యానర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి కాని జంటలకు పార్కులో ప్రవేశం లేదు అని ఆ బ్యానర్‌లో పేర్కొన్నారు. ఇట్లు... పార్క్ మేనేజ్ మెంట్ అని ఆ బ్యానర్లో స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర కలకలం రేగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యానరే దర్శనమిస్తోంది.

మేయర్‌కు ట్యాగ్
మీరా సంఘమిత్ర అనే సామాజికవేత్త జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని ట్యాగ్ చేశారు. పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హత ప్రమాణంగా నిర్దేశించడం ఏంటి? పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉంటుంది. బ్యానర్ లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని మీరా సంఘమిత్ర స్పష్టం చేశారు. ఈ బ్యానర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్‌ను తొలగించింది.

శృంగారం కూడా..
ఆ బ్యానర్ ఎవరు ఏర్పాటు చేశారో కానీ ఇన్నర్ వ్యూ అయితే ఓకే.. పెళ్లి కానీ వారు, జంటలు వస్తున్నారని చెప్పారు. అక్కడ కొందరు శృంగారం కూడా చేసుకుంటున్నారని చెప్పేవారు ఉన్నారు. అందుకే ఇందిరా పార్క్ వద్ద అలాంటి బ్యానర్ ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఇదేంటి.. కపుల్ కావాలా అని ప్రశ్నించడం ప్రారంభించారు. అలా వైరల్ అయ్యిందో లేదో.. బల్దియా స్పందించింది. అక్కడ ఎవరు ఏర్పాటు చేశారో కానీ ఆ బ్యానర్ మాత్రం తీసివేశారు.












Click it and Unblock the Notifications