Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
హైదరాబాద్: శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

మానవ మృగాల బారిన పడి..
మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయిందని అన్నారు. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. డా. ప్రియాంక రెడ్డి కుటుంబానికి తన తరపున, జన సైనికుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామన్నారు.

ఆచరణలో లేదు..
‘యత్ర నార్యేస్తూ పూజ్యంతే.. రమాంతే తత్ర దేవతా.. ' అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు. ఇప్పుడు శంషాబాద్ ఘటన అనే కాదు.. కొద్ది రోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుర్మార్గుడు చిదివేశాడు. మొన్నటికి మొన్న వరంగల్‌లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

బహిరంగంగా శిక్షించాలి..
‘నిర్భయ చట్టం తెచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికి ఎలాంటి బెదురూ రావడం లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠిన రీతిలో శిక్షించాలి. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయి' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ సూచనలు
‘పోలీసు శాఖ సైతం షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలి. శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలి. విద్యార్థినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి' అని పవన్ కళ్యాణ్ సూచించారు. బుధవారం రాత్రి ప్రియాంక రెడ్డిని నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి శంషాబాద్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణ హత్యకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications