సిటీలో డ్రగ్స్ దందా.. ఒకరి అరెస్ట్, కొకైన్ స్వాధీనం..
విశ్వనగరి భాగ్యనగరిలో డ్రగ్స్ సరఫరా జోరుగా సాగుతోంది. నైజిరియాకు చెందిన కొందరు యధేచ్చగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు. ఆడపా దడపా రైడ్స్ నిర్వహిస్తేనే.. ఎక్కువ మొత్తంలో మత్తు పట్టుబడుతోంది. కొకైన్ డ్రగ్స్ విక్రయిస్తూ.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులకు ఒకరు చిక్కారు. డానియెల్ నుంచి 4 గ్రాముల కొకైన్, హొండా ఆక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరొకరు పరారీలో ఉన్నారు.డానియెల్ నైజీరియాలో గల లాంగోస్ స్టేట్ అని పోలీసులు తెలిపారు.

ఓలామైడ్ అనే విదేశీయుడు షేక్ పేట్, టోలి చౌకి ప్రాంతంలొ ఉంటూ కూకట్ పల్లి లో గల ఓ కాలేజిలొ డిగ్రీ చదువుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఢిల్లిలో ఉండే నైజీరియాకు చెందిన జాన్ పాల్‌తో కలిశాడు. డానియల్.. హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో మత్తుకు బానిసైన వారిని ఎంచుకుని ఉన్న చోటుకే వెళ్లి గ్రామను రూ. 8 నుంచి 10 వేల రూపాయలకు అమ్మి.. సొమ్ము చేసుకుంటున్నాడు.
గతంలో లంగర్ హౌస్ పొలిసులకు చిక్కడంతో జైలుకు కూడా వెళ్లాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. డానియల్ డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి సిబ్బందిని అలర్ట్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ.రాఘవేంద్ర ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించి డానియల్‌ను అదుపులొకి తీసుకున్నారు. డానియల్ 2014లో విద్యార్థి వీసాపై సిటీకి వచ్చినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Recommended Video
కాలేజీ చదివే విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తారు. వారిని బానిసలుగా చేసి.. పదే పదే డ్రగ్స్ అమ్ముతుంటారు. వీరిని పకడ్బందీగా పట్టుకుంటే తప్ప తెలియలేదు. వీరితోపాటు అసోసియేట్ అయినవారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications