వదల బొమ్మాళీ.. తీగలకు వెయ్యి ఫైన్... మాస్క్ లేకుంటే మడత పడింది..
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నారు. చిన్న, పెద్ద.. తమ తర అనే భేదం చూపించడం లేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యేను కూడా పోలీసులు వదల్లేదు. ఫైన్ వేసి తమకు అందరూ సమానమేనని తేల్చిచెప్పారు.
తీగల కృష్ణారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే.. మాజీ మేయర్ కూడా.. కానీ ఆయన కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేశారు. ఇంకేముంది పోలీసులు కూడా అదేవిధంగా ప్రవర్తించారు. సరూర్ నగర్ వద్ద గుండా తీగల కారు వెళుతోంది. అందులో ఉన్న ఆయన మాస్క్ పెట్టుకోలేదు. దీంతో పోలీసులు కారు ఆపారు. కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద తీగల కారును ఆపి.. పరిశీలించారు. తీరా చూస్తే అందులో ఉన్న ఆయనకు మాస్క్ లేదు.

Recommended Video
కరోనా కేసులు పెరుగుతున్నందున పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు ఏం మినహాయింపు కాదు. తీగలకు పోలీసులు రూ. వెయ్యి జరిమానా విధించారు. చలానా అందించగా.. ఎస్సై ముఖేశ్‌తో తీగల వాగ్వివాదానికి దిగారు. తమకు అందరూ సమానమేనని ఎస్సై చెప్పారు. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందున ఫైన్ వేశామని ఎస్సై తెలిపారు.












Click it and Unblock the Notifications