పోలింగ్ డే హాలిడే.. ఐటీ కంపెనీలకు ఈసీ ఆదేశం..!
హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. అటు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ జరిగే గురువారం (11.04.2019) నాడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించాయి. అయితే కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం చర్చానీయాంశమైంది.
ఏపీ, తెలంగాణకు చెందిన యువత హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పోలింగ్ తేదీని కొన్ని సంస్థలు సెలవుదినంగా ప్రకటించాయి. అదలావుంటే మరికొన్ని కంపెనీలు ప్రాజెక్ట్స్ పూర్తికాలేదంటూ హాలిడే ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఎవరైనా కాదు కూడదని డుమ్మా కొడితే తగిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాయట. దాంతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేయని పరిస్థితి నెలకొంది.

పోలింగ్ నాడు సెలవు లేదంటూ మొండికేసిన ఐటీ కంపెనీల తీరుపై.. ఫోరమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయిస్ ప్రతినిధులు మండిపడుతున్నారు. హాలిడే ఇవ్వకుండా సతాయిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. వీరి వినతి మేరకు స్పందించిన ఈసీ అధికారులు.. గురువారం కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఐటీ కంపెనీలను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications