TSPSC Paper Leak: ప్రవీణ్ మొబైల్‍లో పలువురి మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు..!
ఏఈ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ ఫోన్ లో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఏఈ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఫోన్ నుంచి పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు పోలీసుల విచారణ పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రవీణ్ కుమార్ 2017 నుంచి టీఎస్‍పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్ హోదాలో వెరిఫికేషన్ విభాగంలో పని చేస్తున్నాడు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్ల ప్రవీణ్ తీసుకునేవాడని దర్యాప్తులో తేలింది.

ప్రవీణ్ మహిళ అభ్యర్థుల అప్లికేషనల్లో ఉండే సాంకేతిక సమస్యలు పరిష్కరించి.. వారికి సాయం చేసినట్లుగా నటించేవాడు. వారితో చనువు పెంచుకునేవాడు. వారికి ఫోన్ చేస్తూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్ పలువురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో మహిళలకు సంబంధించి ఫోన్ నెంబర్లు, వాట్సాప్ చాటింగ్ లు, మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు పోలీసులు గుర్తించారు.
ఏఈ పేపర్ కూడా రేణుక కోసం ప్రవీణ్ లీక్ చేసిన పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులు పోలీసులు ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. పేపర్ల లీక్ పై టీఎస్‍పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు.
కాగా ఈ వ్యవహరంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో చేశాయి.












Click it and Unblock the Notifications