ఏపీని మైమరిపిస్తోన్న లంగర్ హౌజ్ రోడ్లు..పట్టించుకునే నాథుడే లేడా..?
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది హైదరాబాద్ పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. హైదరాబాద్ అనగానే అందరికి హైటెక్ సిటీ, జుబ్లీహిల్స్, బంజరాహిల్స్, కూకట్ పల్లి, మాదాపుర్, గచ్చిబౌలి, వంటి ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్దికి నోచుకోలేదు. అలాంటి ప్రాంతాల్లో లంగర్ హౌజ్ కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటకీ లంగర్ హౌజ్ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ది జరిగింది లేదు.
లంగర్ హౌజ్‌లోని పలు ఏరియాలను పరిశీలిస్తే మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. అక్కడి రోడ్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. లంగర్ హౌజ్‌లో సీసీ రోడ్లు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. 2004 వైఎస్ఆర్ హయంలో వేసిన సిమెంట్ రోడ్లు ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమీ కూడా లంగర్ హౌజ్ ప్రాంతాన్ని పట్టించుకుంది లేదు. లంగర్ హౌజ్‌లో కొన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్డులే దర్శనం ఇస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్థవ్యస్థం ఉంది. మంజీరా వాటర్ పైప్‌లైన్ లీక్‌లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మంచిగా ఉన్న రోడ్లను సైతం గత ఏప్రిల్ నెలలో అభివృద్ది పేరుతో నాశనం చేశారు. కొన్ని ప్రాంతాల్లో బూతద్దంతో వేతికిన రోడ్లు కనిపించని పరిస్థితి. చినపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా బురదమయంగా మారుతున్నాయి. ఓట్లు సమయంలో కనిపించిన నాయకులెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని లంగర్ హౌజ్ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.ఏపీ రోడ్లను లంగర్ హౌజ్ రోడ్లు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ జయంతి నాడు, లంగర్ హౌజ్‌లోని బాపు ఘాట్‌కు రావడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ సమస్యలకు పరిష్కరం దొరకలేదు. దీంతో చేసేది లేక ఈ బురద రోడ్ల మీదనే స్థానికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరి లంగర్ హౌజ్ ప్రాంత ప్రజల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో చూడాలి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications