Sajjanar: ఎక్కడికి ఈ పరుగు.. ఎక్కడికి ఈ గమ్యంలేని పయనం.. హృదయాన్ని కదిలించిన సజ్జనార్ ట్వీట్..
వారు వృద్ధ అంధ దంపతులు.. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు పెళ్లి చేసుకోని వెళ్లిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు.. కానీ భార్యతో విడిపోయాడు. అతను నాలుగేళ్లుగా వృద్ధ అంధ దంపతుల తల్లిదండ్రులే వద్ద ఉంటున్నాడు. అయితే అతను ఇంట్లో చనిపోయాడు. కానీ ఆ విషయాన్ని వృద్ధ దంపతులు గమనించలేకపోయారు. నాని.. నాని అటూ రోజుల నుంచి పిలుస్తూనే ఉన్నారు. తమ కుమారుడు తమని వీడిపోయారని వారు గ్రహించలేకపోయారు. చివరి పోలీసులు వచ్చి చెప్పడంతో అయ్యో దేవుడా.. అంటూ రోదించారు.
ఈ ఘటన హైదరాబాద్ నాగోల్ పరిధిలోని జైపురి కాలనీలో జరిగింది. ఈ కాలనీలో రమణ, శాంతకుమారి అనే వృద్ద దంపతులు ఉన్నారు. వీరికి కళ్లు కనిపించవు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. చిన్న కుమారుడు ప్రమోద్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ భార్యతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యం తాగి వచ్చిన ప్రమోద్ పడుకున్నాడు. నిద్రలోనే కన్ను మూశాడు. అయితే ఈ విషయాన్ని ఆ అంధ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు.

వారు ప్రమోద్.. ప్రమోద్ అని అంటూనే ఉన్నారు. కానీ ప్రమోద్ పలకడం లేదు. ప్రమోద్ చనిపోయిన మూడు రోజుల తర్వాత దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి వెళ్లగానే ప్రమోద్.. ప్రమోద అంటూ దీనంగా పిలుస్తన్నారు. వారు నడవలేని, కదల్లేని స్థితిలో ఉన్నారు. వారిని చూసిన సీఐ సూర్యనాయక్ చలించిపోయాడు. వారికి కాస్త ఆహారం అదించాడు. మీ కుమారుడు చనిపోయాడని చెప్పారు. దీంతో ఆ వృద్ధ దంపతులు రోదించిన తీరు అక్కడి వారిని కదిలించింది.
ఆ తర్వాత పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఎమోషనల్ ట్వీట్ చేశారు. " కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన! హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది. మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇది.
ఇలాంటి మనుషుల మధ్యన మనం కూడా మనుగడ సాగిస్తున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. అంగారక గ్రహం మీద కూడా అడుగు పెట్టాలనుకుంటున్న మనిషి.. పక్క మనిషి బాధల్లోకి, మనుసుల్లోకి తొంగి చూడలేకపోవడం బాధాకరం. ఎక్కడికి ఈ పరుగు.. ఎక్కడికి ఈ గమ్యంలేని పయనం. నాలుగు రోజులు తిండి నీళ్లు లేకుండా ఆకలికి అలమటించిన ఆ వృద్ద దంపతులకు కాదు చూపులేనిది, మనకే, మన సమజానికే. మనిషి - స్పందించు!!" అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 30, 2024
హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది.
మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇది.
ఇలాంటి మనుషుల మధ్యన మనం కూడా మనుగడ సాగిస్తున్నామా.. అనే అనుమానం కలుగుతోంది.
అంగారక గ్రహం మీద కూడా అడుగు పెట్టాలనుకుంటున్న… pic.twitter.com/rIpzYKmBvd
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications