సమంతకు భరణం ఎంతో తెలుసా : అక్కడే సామ్ భారీ ట్విస్ట్ : చివరకు ఏం జరిగింది..!!

సమంత- నాగచైతన్య విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి వారిద్దరూ ముగింపు పలికారు. ఈ విషం పైన గత ఆరు నెలల కాలంగా ప్రచారం సాగుతోంది. చివరకు వాళ్లిద్దరే సోషల్ మీడియా ద్వారా తమ ఇద్దరి వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించారు. దీని వెనుక కారణాలు అనేకం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, నాగ చైతన్య తమ మధ్య వివాహ బంధం ముగిసిపోయిందని చెబుతూనే..భవిష్యత్ లో ఇద్దరం స్నేహితులుగా ఉంటామని చెప్పారు. తమ ప్రైవసీని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. సమంత సైతం అదే లెటర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

సంచలనంగా మారిన చై-సామ్ విడాకులు

సంచలనంగా మారిన చై-సామ్ విడాకులు

ఈ విషయం టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ అయింది. జాతీయ మీడియా సైతం వీరిద్దరి విడాకుల నిర్ణక్ష్ం పైన పలు కధనాలు ఇచ్చాయి. అయితే, అందులో ప్రముఖ జాతీయ ఇంగ్లీషు దిన పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఒక ఆసక్తి కర కధనం ఇచ్చింది. అందులో సమంత కు అక్కినేని కుటుంబం నుంచి భరణం కింద వచ్చిన ఆఫర్..సమంత రియాక్షన్ ఏంటనేది కధనం లో పేర్కొన్నారు. పదేళ్ల పాటు ప్రేమించకుంటూ.. ఇద్దరూ ఒక రంటే ఒకరు ఇష్టపడి చై-సామ్ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం గోవాలో ఇద్దరి సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది.

విడాకుల వెనుక కారణాలపైన భిన్న కధనాలు

విడాకుల వెనుక కారణాలపైన భిన్న కధనాలు

అక్కినేని కోడలుగా సమంత హ్యాపీగానే కనిపించారు. కానీ, ఆమెకు వచ్చిన ఆఫర్లు.. నటించిన వెబ్ సిరీస్ లే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు కారణంగా తెలుస్తోంది. వాటి పైన అక్కినేని కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయటం ..అలా చెప్పటం సమంతకు నచ్చకపోవటం తో అప్పటి నుంచి గ్యాప్ పెరిగిందని ఇండస్ట్రీ టాక్ .

ఇక, నాగచైతన్యతో విడిపోవాలని నిర్ణయించుకున్నాక... సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా పలు సంకేతాలు ఇచ్చారు. తొలుత తన పేరు చివర అక్కినేని ఇంటిపేరు తొలగించారు.

సమంతకు భరణం ఎంత అంటూ చర్చ

సమంతకు భరణం ఎంత అంటూ చర్చ

ఆరు వారాల నుంచి 'మై మామ్‌ సెడ్‌' (అమ్మ చెప్పింది) అంటూ సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ పోస్టులు చేస్తున్నారు. అవి చూస్తే ఏదో జరుగుతుందని అర్థమైంది. వాటిని నిజం చేస్తూ విడిపోతున్నట్టు ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. దీని పైన నాగార్జున సైతం ఆవేదన వ్యక్తం చేసారు. వారిద్దరికి దేవుడు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆకాంక్షించారు. సమంత తమ కుటుంబం తో ఉన్నన్ని రోజులు తీపి గుర్తులే అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్య, సమంత విడాకులతో పాటు భరణం ఎంత... అనేది చర్చనీయాంశమైంది.

సమంత సంచలన నిర్ణయంతో షాక్

సమంత సంచలన నిర్ణయంతో షాక్

ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి కుటుంబాల నుంచి చైతన్యకు వారసత్వంగా ఆస్తి వచ్చింది. ఒక్కో సినిమాకూ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు 100 నుంచి 200 కోట్ల రూపాయలు భరణంగా వస్తుందనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో నాగ చైతన్యతో వివాహ బంధం ముగిసిపోవటంతో సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ దిన పత్రికలో వచ్చిన కధనం మేరకు సమంతకు నాగ చైతన్య నుంచి రెండు వందల కోట్ల మేర భరణం ఇస్తామని ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు.

సమంత నిర్ణయం పైన ఆసక్తి కర చర్చ

సమంత నిర్ణయం పైన ఆసక్తి కర చర్చ

కానీ, అంత మొత్తాన్ని సమంత తనకు వద్దంటూ తిరస్కరించారని తెలుస్తోంది. తమ మధ్య భార్యభర్తల బంధమే లేకపోయిన తరువాత..ఇక, తనకు ఆ డబ్బు అవసరం లేదని సమంత చెప్పినట్లుగా సమాచారం. సమంత సినిమాలు - వెబ్ సిరీస్ ల ద్వారా బిజీగా ఉన్నారు. తనకు డబ్బు అవసరం లేదని సమంత ఖరాఖండిగా తేల్చి చెప్పారని తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ అంశం సైతం సమంత -నాగ చైతన్య విడాకుల వార్తల్లో భాగంగా హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+