Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, భువనేశ్వర్‍కు ప్రత్యేక రైళ్లు.. ఎప్పుడంటే..!
అత్యంత చౌక ప్రయాణం చేయాలంటే రైళ్లలోనే చేయాలి. ఇండియాలో రైలు ప్రయాణం చాలా చౌకగా ఉంటుంది. అయితే కొన్ని రద్దీ రూట్లలో ప్రయాణం చేయాలంటే మాత్రం నెల, రెండు నెలల ముందుగానే టికెట్లు బుక్ చెసుకోవాల్సి ఉంటుంది. రద్దీ రూట్లలో రైలు టికెట్లు లభించక బస్సు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే రద్దీ రూట్లలో రైల్వే అప్పడప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరొచ్చు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, భువనేశ్వర్ కు నడపనున్నారు. అంటే ఒక రైలును సికింద్రాబాద్-తిరుపతి, మరో రైలును సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రెండు రోజుల పాటు నడవనున్నాయి. నంబర్ 07489 గల రైలు ఆగస్టు 11 రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి ఆగస్టు 12న ఉదయం 9.30 కు తిరుపతికి చేరుకోనుంది. 07490 నంబర్ గల రైలు తిరుపతిలో అదే రోజు సాయంత్రం 4.35 కు బయలుదేరి ఆగస్టు 13న తెల్లవారుజామున 4.50 గంటలకు సికింద్రబాద్ చేరుకోనుంది.

ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 07058 నంబర్ గల రైలు ఆగస్టు 11 మధ్యాహ్నం 3.25 కు రైలు బయల్దేరింది. ఈ రైలు ఆగస్టు 12న ఉదయం 10.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనుంది. రైలు నెం- 07059 (భువనేశ్వర్- - సికింద్రాబాద్) 07059 నంబర్ గల ప్రత్యేక రైలు అదే రోజు మధ్యాహ్నం 3.05 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఆగస్టు 13న ఉదయం 3.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
ఈ స్పెషల్ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం, బెర్హంపూర్, బలుగాన్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు గమనించి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించగలని రైల్వే శాఖ సూచించింది. ఇప్పుడే కాదు పండులప్పుడు కూడా రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంటుంది.












Click it and Unblock the Notifications