సికింద్రాబాద్ కు ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్
హోలీ పండగ దగ్గర పడుతోంది. దక్షిణాదికన్నా ఉత్తరాదిలో ఎక్కువగా ఈ పండగ చేసుకుంటారు. ఈ పండగ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉత్తర భారతదేశ ప్రజలకు సొంతూళ్లకు వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారికోసం శుభవార్తను వినిపించారు. వీరికోసం 18 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇవి నడుస్తాయి. ఈనెల 16వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.
ప్రత్యేక రైళ్ల జాబితా
హైదరాబాద్ - పాట్నా, పాట్నా - హైదరాబాద్, పాట్నా - రక్సాల్, రక్సాల్ - కాచిగూడ, కాచిగూడ - రక్సాల్, సికింద్రాబాద్ - గోమతి నగర్, గోమతి నగర్ - సికింద్రాబాద్, సంత్రాగంచి - సికింద్రాబాద్, కాచిగూడ - లాల్ ఘర్, లాల్ ఘర్ - కాచిగూడ, సికింద్రాబాద్ - షాలిమార్, షాలిమార్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - దర్బాంగా, దర్బాంగా - సికింద్రాబాద్ కు ఈ రైళ్లు నడవనున్నాయి.

ప్రత్యేక రైళ్ల పేరుతో ఏర్పాటు చేస్తున్నవాటిల్లో టికెట్ ధరలు అధికంగా ఉంటున్నాయని, అలాగే వీటిని ప్రాధాన్యత ప్రకారం నడపకుండా ఇతర రెగ్యులర్ రైళ్లను ముందుకు పంపిస్తూ వీటిని గంటల తరబడి శివారు ప్రాంతాల్లో ఆపేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. సిగ్నల్ సమస్య వచ్చినప్పుడు తప్పితే ఇతరత్రా ఆలస్యంగా నడవడంలేదని చెబుతున్నారు.
అమృత్ భారత్ పేరుతో ఏర్పాటు చేస్తున్న రైళ్లను ఉత్తరాదివారు ఎక్కువగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీలతో నడుస్తున్నాయని, ప్రతి సీటుకు ఛార్జింగ్ సౌకర్యం ఉండటంతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని రైల్వే చెబుతోంది.












Click it and Unblock the Notifications