Mahesh babu : మీడియాకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపిస్తుంటారు.సినిమాల్లో కన్నా బయటే ఆయన ఎక్కువ సరదాగా ఉంటారు. అలాంటి మహేష్ బాబుకు తొలిసారి కోపం వచ్చింది. అది కూడా మీడియా మీద కావడం విశేషం. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో... మహేష్ బాబు మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో కౌంటర్స్ కూడా ఇచ్చారాయన.
మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గత రెండేళ్లుగా 'బిగ్ సి'కి అంబాసీడర్ పని చేస్తున్నారాయన. ఈ కంపెనీ 20వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు.. మీడియాతో కాసేపు ముచ్చటించారు.ఈ సమయంలో ఆయన తన లేటేస్ట్ మూవీ 'గుంటూరు కారం' విషయాలను మీడియాతో పంచుకున్నారు.

అందరూ అనుకున్నట్టుగా సినిమా వాయిదా పడలేదని.. అనుకున్న సమయానికి 'గుంటూరు కారం' థియేటర్లలో సందడి చేస్తోందని ఆయన తెలిపారు. వచ్చే సంక్రాంతి బరిలో తమ సినిమా ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సినిమా అదిరిపోతుందని మీరు వెళ్లి చూడండి బాగుంటుందని మీడియా ప్రతినిధులకు సూచనలు కూడా చేశారు.
అయితే ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై మహేష్ బాబు అసహనం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు మీరు ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తుంటారు కదా.. దీనిపై వచ్చే విమర్శలు మీ వరకు వచ్చాయా అని మహేష్‌ను ప్రశ్నించారు. దీనికి మహేష్ సమాధానం ఇస్తూ...'అదేంటండి. నా డబ్బులతో నేను ట్రిప్‌లకు వెళ్తే బాధ ఏంటీ..? మా పిల్లలకు సెలవులు దొరికినప్పుడో, నాకు షూటింగ్ గ్యాప్స్ వచ్చినప్పుడో విదేశాలకు వెళ్తుంటాను.

నాకు ఫ్యామిలీతో గడపడం ఇష్టం' అందుకే వారితో ఎక్కువుగా సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు.అదేదో పెద్ద నేరంగా మాట్లాడుతున్నారని ఒకింత మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications