ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం తన తదుపరి విచారణనను జులైకి వాయిదా వేసింది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో దర్యాప్తు వద్దనే నిబంధన ఉందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన సంజీవ్ ఖన్నా ధర్మాసం తన తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు.. దేశవ్యప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఫిబ్రవరి5న హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ విధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

supreme court adjourned the brs mlas purchase case

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి భారతీయ జనతాపార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తుండగా, దీనిపై తమ పార్టీకెటువంటి సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. విషయం బయటపడిన సమయంలో రెండురోజులు ఈ రెండు పార్టీల మధ్య పోరు నడిచింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. తదుపరి విచారణను జులైకి వాయిదా వేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+