Lulu On Sale 2026:లులులో భారీ డిస్కౌంట్- షాపింగ్ లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్..!!
ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీనందు లులు మాల్లో సందడి చేసాడు.ఈ సందర్భంగా మాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆయన 'లులు ఆన్ సేల్' అధికారిక లోగోను మరియు ప్రత్యేక టీ-షర్ట్‌ను ఆవిష్కరించారు.ఈ వేడుకకు నందు రాకతో లులు మాల్ పరిసరాలు అభిమానులు, సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. లోగో ఆవిష్కరణ అనంతరం. హీరో నందు తనదైన శైలిలో కస్టమర్లతో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఆ తరువాత విలేకరుల సమావేశంలో ,ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 'లులు ఆన్ సేల్' (LOS) నిర్వహిస్తున్నట్లు , ఈ 4 రోజులు ( 9వ తేదీ నుండి 12 జులై 2026 ) వినియోగదారుల కోసం Flat 50% Off డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

200 లకు పైగా బ్రాండ్లు ఈ మెగా సేల్‌లో పాల్గొంటున్నాయని , ఫుడ్ కోర్ట్లో(food court) స్పెసైల్ ఆఫర్ పొందవచ్చని మరియు మాల్ లోని ఇతర రిటైల్ స్టోర్లు సైతం ఇందులో పాల్గొంటున్నాయన్నారు. లులు గ్రాండ్ షాపింగ్ కార్నివాల్ కాంటెస్ట్ లో లులు హ్యాపీనెస్ రిజిస్టర్డ్ కస్టమర్లకు కనీసం రూ.2999 షాపింగ్ చేసిన వాళ్లు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ i20 కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు.
లులు హైపర్ మార్కెట్ లో గ్రాసరీస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితర 25 వేలకు పైగా వస్తువులపై Flat 50 % తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు.
అటు గేమ్స్ జోన్ ఫంతురాలో ప్రత్యేకంగా 100% బోనస్ సెలబ్రేషన్ ఆఫర్‌ను అందిస్తున్నారు. రూ. 2000/- లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే, ఆ అమౌంట్ డబుల్ (రెట్టింపు) అవుతుంది ,దీనితో పాటు కస్టమర్లకు ఉచితంగా రైడ్ కౌపోన్స్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
లులు హ్యాపినెస్ లోయాలిటీ కస్టమర్లకు 8వ తేదీ నుంచే సేల్ యాక్సెస్ ఉంటుందని , ఈ నాలుగు రోజులు ఉదయం 9 గంటల నుండి స్టోర్ ఓపెన్ ఉంటుందని,
వినియోగదారులకు సౌకర్యార్థం అదనపు పార్కింగ్ మరియు ఇతర వసతులతో సహా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.ఈ ప్రెస్ మీట్లో మాల్ రీజినల్ మేనేజర్ మహ్మద్ షరీఫ్, మాల్ మేనేజర్ ఏజిల్ అరసన్, డీజీఎం విశాల్ కుమాల్, ఫాంటురా అసిస్టెంట్ మేనేజర్ సూర్యకాంత్, మార్కెటింగ్ మేనేజర్లు ఫణి & మను ఆంథోనీ పాల్గొన్నారు












Click it and Unblock the Notifications