పాకిస్తాన్ నుంచి ఆపరేట్- లష్కరే తొయిబా కింగ్ పిన్ ఖతం

జమ్మూ కాశ్మీర్‌ షోపియాన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న భారీ ఉగ్రవేట ముగిసింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ జకీర్ గనాయ్ హతమయ్యాడు. నాలుగు రోజులకు పైగా సాగిన ఈ సుదీర్ఘ గాలింపు చర్యలు ఎన్‌కౌంటర్‌తో ముగిశాయి. స్థానిక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో భద్రతా బలగాలకు ఇది లభించిన అత్యంత కీలక విజయంగా భావిస్తోన్నారు.

షోపియాన్‌లోని చానాపోరా ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఈ నెల 3వ తేదీన నిఘా కెమెరాల ద్వారా భద్రతా బలగాలు గుర్తించాయి. దీని ఆధారంగా రంగంలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక బృందం, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ఉదయం వారు తలదాచుకున్న ప్రాంతానికి చేరుకున్నాయి. మొదట ఇద్దరు ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు. దీన్ని పట్టించుకోకుండా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో జకీర్ మరణించాడు.

Lashkar e Taiba Commander Zakir Ganai Neutralised as Security Forces Intensify Hunt Latif in Shopian

ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. జాయింట్ ఆపరేషన్‌లో లష్కర్ ఉగ్రవాది నేలకూలాడని ప్రకటించారు. ఘటనా స్థలం నుండి జాకీర్ గనాయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నాయి. కాశ్మీర్‌ కుల్గామ్ కు చెందిన జాకీర్ గనాయ్ 2024లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.

ఎన్‌కౌంటర్‌లో జాకీర్ గనాయ్ హతమైనప్పటికీ, అతనితో పాటు ఉన్న లతీఫ్ అనే మరో లష్కర్ ఉగ్రవాది ఉన్నప్పటికీ.. భద్రత సిబ్బంది కన్నుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని వదలకుండా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆర్మీ కౌంటర్ ఇంసెర్జెన్సీ విభాగానికి చెందిన విక్టర్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఉగ్రవాది తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేశారు. చుట్టుపక్కల సరిహద్దులను దిగ్బంధించారు.

పరారీలో ఉన్న ఉగ్రవాది లతీఫ్ కూడా కుల్గామ్ జిల్లాకు చెందినవాడేనని, గత ఏడాదే ఈ తీవ్రవాద ముఠాలో చేరినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. షోపియాన్.. వ్యూహాత్మకంగా క్రియాశీలక ప్రాంతంలో ఉంటుంది. పీర్ పంజాల్ తో కలిపే కీలక దారి కావడంతో ఉగ్రవాదులు తమ రవాణా మార్గంగా దీనిని వాడుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉగ్ర కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచడం ద్వారా సరిహద్దుల్లో చొరబాట్లను నియంత్రణలోకి తీసుకురావచ్చని భద్రత బలగాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+