ఉద్యోగంలోంచి తీసేశారు: మనస్తాపంతో లేడీ టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించారని మనస్తాపం చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

రెండున్నరేళ్ల క్రితం నగరానికి..
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌లోని జగదాంబనగర్ కాలనీకి చెందిన హరిణి(24) బీటెక్ పూర్తి చేసుకుని రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది.
గచ్చిబౌలి సైబర్‌హిల్స్‌లోని వసతి గృహంలో ఉంటూ మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.

ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
అదనపు సిబ్బందిని తొలగించే క్రమంలో ఆ సంస్థ కొంతమంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ వరకు దీనికి గడువు విధించింది. కాగా, నోటీసులు అందుకున్న వారిలో హరిణి కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగం కోల్పోతే తనకు వేరే సంస్థలో ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే ఆ:దోళన చెందిన హరిణి తీవ్ర నిర్ణయానికి వచ్చింది.

తన గదిలోనే..
మంగళవారం రాత్రి తాను ఉంటున్న వసతి గృహంలోని తన గదిలోనే ఉరివేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోతోందని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తీసేయడంపై ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications