మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్.. ఎగ్జామ్స్ అయిపోవడంతో రిలాక్సయ్యారు. అయితే ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
పదో తరగతి ఫలితాలను నెల వ్యవధిలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మే రెండో వారంలోగా రిజల్ట్స్ అనౌన్స్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బి.సుధాకర్. ఈ నెల 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 75 వేల 757 మంది విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీచేయగా.. 4 లక్షల 73 వేల 321 మంది పరీక్షలకు హాజరయినట్లు వివరించారు.













Click it and Unblock the Notifications