GHMC: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దీపావళి కానుక.. !
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీలో పని చేసేవారికి రెండు రోజులు ముందుగానే జీతాలు ఇచ్చింది. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు సంబంధించి రూ.120 కోట్లను విడుదల చేసింది. జీతం ముందుగా రావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీతం కోసం 5వ తేదీ వరకు ఎదురుచూడాలి. కానీ దీపావళి సందర్బంగా ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని ముందుగానే జీతాలు ఇచ్చింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు.
జీతాలు అందరికి విడుదల చేశారా.. లేక కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు విడుదల చేశారా అనేది తెలియాల్సి ఉంది. కాగా జీహెచ్ఎంసీలో అన్ని విభాగాల్లో ఫేషియల్ అటెండెన్సీ విధానం అమలు చేస్తున్నారు. మొత్తం 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ ద్వారా క్యాప్చర్ చేయడం ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 39 విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ ద్వారా నమోదు అవుతున్నాయి. గతంలో జీహెచ్ఎంసీలో ఉద్యోగుల హాజర్ ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హ్యాండ్ హెల్డ్ డివైజ్ తో తీసుకునే వారు. ఈ విధానంలో చాలా వరకు అవకతవకలు జరిగాయి. క్లోనింగ్ ద్వారా హాజర్ వేసి మోసాలకు పాల్పడ్డారు. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తీసుకొచ్చారు. ఈ విధానంతో పారదర్శకంగా, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదు అవుతుంది.












Click it and Unblock the Notifications