Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్యే ఉండదు..!
హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం భాగ్యనగరం వస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. కొన్ని చోట్లు ఔటర్ రింగ్ రోడ్డు దాటింది. దీంతో జనాభా భారీగా పెరిగింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా సిటీలో తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేస్తోంది. సింగూరు, మంజీర, నిజాంసాగర్ రిజర్వాయర్‌లకు గోదావరి నది నుంచి నీటిని తరలించేందుకు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగిన సమీక్షా సమావేశం ఏర్పాట్ చేశారు. మెదక్ జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఇంజనీర్లు ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సింగూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడిక తీసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. హైదరాబాద్‌కు నమ్మకమైన నీటి సరఫరా జరిగేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సింగూరు రిజర్వాయర్ కింద కాలువ లైనింగ్ పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
అలాగే బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ.660 కోట్లతో నిర్మించనున్న పెద్దారెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో నిలిచిపోయిన ప్యాకేజీ 19ఎ పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. 17, 18, 19 ప్యాకేజీలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నారాయణఖేడ్‌లోని 38 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, నల్లవాగు మీడియం ప్రాజెక్టు కాలువ మరమ్మతులకు త్వరగా పూర్తి చేయలన్నారు.












Click it and Unblock the Notifications