Hyderabad: 4 గంటలు ఆలస్యంగా బయల్దేరిన విమానం.. ప్రయాణికుల ఆగ్రహం..
ఏదో పని మీదనో లేదా తీర్థ యాత్రలకూ లేదా విహారయాత్రకు వెళ్తుంటాం. ఇందు కోసం బస్సులు, కార్లు, రైళ్లు, విమానాల్లో ప్రయాణం చేస్తాం. దూర ప్రాంతాలకు అయితే రైళ్లు లేదా విమానాల్లో వెళ్తాం. ఇందుకోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఫలాన తేదీన ఫలాన టైమ్ కు వెళ్లే రైళ్లు, విమానాలకు టికెట్లు బుక్ చేసుకుంటాం. విమానం బయల్దేరే గంట లేదా రెండు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకుంటాం.
అని పనులు పూర్తి చేసుకుని విమానం ఎక్కడానికి సిద్దమవుతాం. తీరా విమానం ఎక్క సమయానికి మీ విమానం ఆలస్యం అవుతుందని చెబితే ఎలా ఫీల్ అవుతాం. అది కూడా 4 గంటల ఆలస్యం అంటే.. కోపం వస్తుంది. అచ్చంగా ఇలా జరిగింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జిఐఎ)గా విమానం నాలుగు గంటల ఆలస్యంగా బయల్దేరడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్లే విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఘటన సోమవారం జరిగింది. ఫ్లైట్ ఆలస్యం కారణంగాచాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ప్డారు. ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరింది.
విమానాలు ఆలస్యంగా నడవడం ఇదేం మొదటిసారి కాదు.మే నెలలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E 6707 సాంకేతిక లోపం కారణంగా RGIA వద్ద రన్‌వేపై ఇరుక్కుపోయి దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ఆ విమానంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications