Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల..
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల డబ్బులు వసూలు చేయడానికి రాయితీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. ముందుగా డిసెంబర్ 26 నుంచి చలాన్ల పేమెంట్ పై డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో చాలా మంది తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఆన్ లైన్ వెబ్ సైట్ ఓపెన్ చేశారు.
పేమెంట్ చేయడానికి సిద్ధం కాగా.. వారికి రాయితీ రాలేదు. దీంతో వారు పేమెంట్ ను నిలిపివేశారు. దీంతో చాలా మంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఎక్స్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పెండింగ్ చలాన్లపై రాయితీ రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి భారీగా దీనిపై వినతులు రావడంతో పోలీస్ శాఖ కూడా స్పందించింది. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల చెల్లింపుల్లో రాయితీ ప్రకటించినా.. దీనిపై అధికార అదేశాలు రాలేదని పేర్కొంది.

చలాన్ల రాయితీపై జీవో విడుదల కాలేదని వివరించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు, జీవో విడుదల అయిన వెంటనే రాయితీ ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు వాహనదారులు ఓపిగ్గా ఉండాలంటూ కోరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. దీంతో చాలా మంది పెండింగ్ చలాన్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు.
Sir, we are receiving multiple tweets and msg's on social media platforms regarding discount. But yet, we haven’t received any official confirmation. Once receive, we will update the same on Social Media platforms. Thanks😊
— Hyderabad Traffic Police (@HYDTP) December 26, 2023
Regards
Hyderabad Traffic Police.
కానీ ఇంకా రాయితీ ఇవ్వడం లేదని తెలిసి నిరాశ చెందారు. ఈసారి ఆర్టీసీపై ట్రాఫిక్ చలాన్లకు 90 శాతం రాయితీ ఇవ్వగా.. టూ వీలర్స్, ఆటోలపై 80 శాతం, కార్లపై 60 శాతం, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు 90 శాతం రాయితీ ప్రకటించారు. రాయితీకి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు జీవో విడుదుల చేస్తోందో చూడాలి.












Click it and Unblock the Notifications