రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే ఉద్యమిస్తాం: వినోద్ కుమార్, వినయ్ భాస్కర్
వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు రైల్ నిలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట వ్యాగన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించాలన్నారు. రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కకేంద్రం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని మండిపడ్డారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంఘీభావం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర కేబినెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్ లు, ప్రాజెక్ట్ లు ఇస్తున్నారని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ లో తెలంగాణ కు అన్యాయం జరిగితే బీజేపీ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు.
Recommended Video
రైల్వే బడ్జెట్‌ను కేంద్రం విస్మరించింది. రైల్వేను అంబానీ, అదానీలకు అప్పగించింది. దీని వల్ల లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాల్లో అవకాశం ఉండదు. ఏడేళ్లుగా ఇదే విషయంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications