Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శంషాబాద్ ఏయిర్ పోర్ట్ వరకు ఆటంకంలేని ప్రయాణం.!కేటిఆర్ ప్రారంభించనున్న ఓవైసీ ఫ్లై ఓవర్.!

హైదరాబాద్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓవైసీ మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ ను మంగళవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా గుర్తింపు తెచ్చే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. విస్తరిస్తున్న మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు జిహెచ్ఎంసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

 అందుబాటులోకి రానున్న ఓవైసీ ఫ్లై ఓవర్.. మంగళవారం ప్రారంభించనున్న కేటీఆర్

అందుబాటులోకి రానున్న ఓవైసీ ఫ్లై ఓవర్.. మంగళవారం ప్రారంభించనున్న కేటీఆర్

నగరానికి దక్షిణ భాగంలో ఉన్న పాత బస్తీ ప్రాంతంలో ప్రజల మౌళిక వసతులు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలరద్దీ క్రమబద్దీకరణ నేపథ్యంలో వ్యూహాత్మక పథకాల ద్వారా రోడ్ల వెడల్పు, జంక్షన్ ల అభివృద్ది, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దక్షిణ ప్రాంతం నుండి సులువుగా తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపడుతున్నారు. మినీ రింగు రోడ్డుగా పిలువబడే ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు గల రోడ్డు మార్గంలో ఫ్లై ఓవర్ లు అండర్ పాసులు ఎస్సార్ డీపి మొదటి దశలో నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో తేనున్నారు.

 మౌళిక వసతుల్లో నగరం టాప్.. ఇక ఎయిర్ పోర్ట్ కు ఆటంకం లేని ప్రయాణం

మౌళిక వసతుల్లో నగరం టాప్.. ఇక ఎయిర్ పోర్ట్ కు ఆటంకం లేని ప్రయాణం

ఈ నేపథ్యంలో మిధాని నుండి ఓవైసీ జంక్షన్ వరకు 63 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1.36కిలోమీటర్ల గల ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసారు. దీన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మంగళవారం లాంచనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజితో నిర్మించారు. నగరంలో దక్షణ ప్రాంతంలో మొట్ట మొదటి బ్రిడ్జి నిర్మాణ వ్యయం 63 కోట్లు కాగా భూసేకరణ యుటిలిటీ నష్ట పరిహారం క్రింద మారో 17 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఈ ప్రాజెక్టు మొత్తం 80 కోట్ల వ్యయం ఐనట్టు తెలుస్తోంది.ఫ్లై ఓవర్ పైన ఎలంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 విస్తరిస్తున్న నగరం.. సదుపాయల కల్పనలో ప్రభుత్వం ముందు చూపు

విస్తరిస్తున్న నగరం.. సదుపాయల కల్పనలో ప్రభుత్వం ముందు చూపు

ఎస్.ఆర్.డి.పి పథకం మొదటి దశలో ఆరంఘడ్ నుండి ఎల్.బి నగర్ వరకు సులువుగా ప్రయాణించేందుకు మొత్తం 7 ప్రాజెక్టులను చేపట్టారు. అందులో 5 ఫ్లై ఓవర్లలలో ఓవైసీ ఫ్లై ఓవర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఒకటి అండర్ పాస్, మరొకటి అర్.ఓ.బి పనులను నల్గొండ ఓవైసీ కారిడార్ ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ పొడిగింపు, బహద్దూర్ పుర, అరంఘర్ నుండి జూ పార్కు కారిడార్ ఫ్లై ఓవర్ ఫలక్ నుమ, ఆర్.ఓ.బి ఉప్పుగూడ ఆర్.యు.బి చేపట్టిన పనులు మార్చి 2022 వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు సి.ఈ తెలిపారు.

 విశ్వనగరం వైపు పరుగులు.. నగరంలో సదుపాయాలకు ప్రాముఖ్యత

విశ్వనగరం వైపు పరుగులు.. నగరంలో సదుపాయాలకు ప్రాముఖ్యత

మంగళవారం ప్రారంభించే ఓవైసీ ఫ్లై ఓవర్ కార్యక్రమంలో మంత్రి తారక రామారావుతో పాటుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితాఇంద్ర రెడ్డి, దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు కేశవరావు, ఎంపిలు అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ, మీర్జా రియాజుల్ ఎఫెంది, యెగ్గే మల్లేశం, శాసన సభా సభ్యులు సురభి వాణీ దేవి, అక్బరుద్దీన్ ఓవైసీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+