మహిళా సాధికారిత ఏదీ, టీఆర్ఎస్ సర్కార్‌పై ఉత్తమ్ ఫైర్
సమయం దొరికితే చాలు టీఆర్ఎస్ పాలనపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతల విమర్శల జడివాన మాత్రం కొనసాగుతుంటుంది. అయితే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తక్కువ కాదని అంటున్నాడు. కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై ఫైర్ అవుతున్నాడు. కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ అన్నారు. వివిధ అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మహిళా సాధికారితకు కాంగ్రెస్ పాలనలో పెద్దపీఠ వేశామని ఉత్తమ్ గుర్తుచేశారు. గులాబీ దళం పాలనలో అతివలు అంటే లెక్కే లేదని చెప్పారు. వారిని చిన్నచూపు చూడటం సరికాదు అని కామెంట్ చేశారు. వారిని ఎప్పుడూ ఓటు బ్యాంకుకు చూడొద్దని హితవు పలికారు. వారిని గౌరవించాలని ఉత్తమ్ కోరారు. చిన్న చూపు చూసి.. వారిని అణగదొక్కడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. తగిన సమయంలో వారే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఉత్తమ్ గుర్తుచేశారు. వడ్డీ లేని రుణాల కోసం సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల కోసం మాత్రం రూ.50 కోట్లు విడుదల చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. అంటే ఎన్నికలు ఉంటేనే డబ్బులు విడుదల చేస్తారా అని సూటిగా అడిగారు. ఇదేం పద్దతి అని విరుచుకుపడ్డారు. మరీ మిగతా నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు.
వడ్డీ కట్టాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి.. మాటతప్పారని ఆరోపించారు. వెంటనే రూ. 1,252 కోట్ల అభయ హస్తం ప్రీమియం డబ్బులు చెల్లించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని కోరారు. వారికి అందజేసే పథకాల్లో కూడా కోత వేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications