హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్సార్ రాజకీయ వారసత్వం , జగన్ లానే స్వతంత్ర వ్యక్తిత్వం.. రాజకీయ బరిలో వైఎస్ షర్మిల బలాలివే !!

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ బిడ్డ గా , జగనన్న వదిలిన బాణంగా, వైయస్ షర్మిల ప్రజలకు సుపరిచితం . ఇప్పుడు సొంత పార్టీ పెట్టాలని రాజకీయ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాలు పెడుతున్నారన్న వార్త సంచలనం . అయితే జగన్ సహకారం లేకుండా షర్మిల పార్టీ పెడుతోందా ? అన్న సహకారం లేకుండా చెల్లెలు తెలంగాణలో పార్టీని సక్సెస్ చేయగలుగుతారా? అసలు ఏ ధైర్యంతో షర్మిల పార్టీ ని పెడుతున్నారు ? రాజకీయంగా షర్మిల ఆలోచనలు ఏంటి? అన్న తో విభేదించటానికి కారణాలేంటి ? తెలంగాణా రాజకీయ బరిలో నిలిచిన వైఎస్ షర్మిల బలాలేంటి ?అన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ , ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అవసరం అయితే ఏపీ సర్కార్‌తో ఫైటింగ్ కైనా రెడీ ... వైఎస్ షర్మిల సపరేట్ పార్టీ వెనుక పెద్ద కథే !!అవసరం అయితే ఏపీ సర్కార్‌తో ఫైటింగ్ కైనా రెడీ ... వైఎస్ షర్మిల సపరేట్ పార్టీ వెనుక పెద్ద కథే !!

 మొన్నటిదాకా అన్న పార్టీ కోసం పని చేసిన చెల్లెలు.. ఇప్పుడు స్వతంత్రంగా రాజకీయాల్లో

మొన్నటిదాకా అన్న పార్టీ కోసం పని చేసిన చెల్లెలు.. ఇప్పుడు స్వతంత్రంగా రాజకీయాల్లో

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడం, నిజంగానే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయం . వై ఎస్ షర్మిల పార్టీతో తెలంగాణలో ఏ పార్టీకి లాభం , ఏ పార్టీకి నష్టం అన్న మాట అటుంచితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, మొన్నటి వరకు అన్న పార్టీ కోసం పని చేసిన చెల్లెలుగా ఆమెకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు వైయస్ షర్మిల రాజకీయంగా వేసిన అడుగులు చూస్తే ఆమె వ్యక్తిత్వం ఇట్టే అర్ధం అవుతుంది.

 కష్టకాలంలో జగన్ లేని లోటు తీర్చి, 14 జిల్లాలలో పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళ

కష్టకాలంలో జగన్ లేని లోటు తీర్చి, 14 జిల్లాలలో పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి తీసుకు రావడం కోసం ఆమె కీలకంగానే పాత్ర పోషించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో 2012 - 2013 సంవత్సరాల కాలంలో జగనన్న వదిలిన బాణంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.కాలికి గాయమైనా సరే , పాదయాత్ర ఆపకుండా సాగించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం 3,112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీకి నేనున్నానంటూ భరోసా ఇచ్చి పార్టీని ముందుకు నడిపించారు. 14 జిల్లాలలో పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళ షర్మిలారెడ్డి.

 తండ్రి రాజకీయ వారసత్వం , అన్నలానే చెల్లెలు కూడా స్వతంత్ర వ్యక్తిత్వం

తండ్రి రాజకీయ వారసత్వం , అన్నలానే చెల్లెలు కూడా స్వతంత్ర వ్యక్తిత్వం


వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ పంథాలోనే పాదయాత్ర చేసి ఏపీలో వైసీపీ అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన ప్పటికీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా షర్మిలకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దొరకలేదు. జగనన్న వదిలిన బాణంగా అన్న కోసం ఇంత కాలం పని చేసిన షర్మిల, తెలంగాణలో పార్టీ పెట్టాలనే విషయంలో అన్నతో విబేధించారు.

 రాజకీయాల్లో కూతుళ్లు కూడా రాణించగలరని షర్మిల ప్రూవ్ చేస్తారా ?

రాజకీయాల్లో కూతుళ్లు కూడా రాణించగలరని షర్మిల ప్రూవ్ చేస్తారా ?


రాజకీయాల విషయంలో అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తారో, అదేవిధంగా చెల్లెలు షర్మిల కూడా స్వతంత్ర ఆలోచనలతో రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో కొడుకులు మాత్రమే కాదు కూతుళ్లు కూడా రాణించగలరని నిరూపించాలనుకుంటున్న షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం ముందుకు సాగాలని యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా మొదలుపెట్టారు.

పార్టీ పెట్టటం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదన్న కేసీఆర్ కు షర్మిల ఝలక్ , ఆమెకు ప్లస్ అయ్యే అంశాలివే

పార్టీ పెట్టటం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదన్న కేసీఆర్ కు షర్మిల ఝలక్ , ఆమెకు ప్లస్ అయ్యే అంశాలివే


పార్టీ పెట్టటం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదన్న కేసీఆర్ కు ఆయన మాట్లాడిన రెండు రోజుల్లోనే షాక్ ఇచ్చారు . పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆమెపై విమర్శలు వచ్చినా, ఎవరు సహకరించినా, సహకరించకపోయినా వెనుదిరుగకుండా ముందుకు సాగాలని దృఢ సంకల్పం ఉన్న వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీని నడపగలుగుతారు అన్నది ఆమె వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు సాగిస్తున్న చర్చ . వైయస్ రాజశేఖర్ రెడ్డి మ్యానరిజం, చేతివాటం, మాట తీరు, నాయకత్వ లక్షణాలు షర్మిలకు ఉండడం ఆమెకు కలిసొచ్చే అంశాలు.

 పార్టీ నడిపే సత్తా షర్మిలకు ఉంది .. అందుకే ఒంటరిగా బరిలోకి

పార్టీ నడిపే సత్తా షర్మిలకు ఉంది .. అందుకే ఒంటరిగా బరిలోకి

రాజకీయ సిద్ధాంతం పై భిన్నాభిప్రాయాలు తప్ప అన్నాచెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని షర్మిల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు . ఇంతకాలం జగనన్న వదిలిన బాణం ప్రస్తుతం తన స్వశక్తి అస్త్రాన్ని ఎవరి సహకారం లేకుండా సంధించాలని భావిస్తోంది అనేది సజ్జల వ్యాఖ్యలను బట్టి కూడా అర్ధం అవుతుంది . షర్మిల రాజకీయంగా తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం, ఎవరినీ లెక్క చెయ్యకుండా , చివరకు అన్న మాట కూడా కాదని తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అన్నది నిర్వివాదాశం .
పార్టీ నడిపే సత్తా ఆమెకు ఉందన్నది ఒప్పుకోవాల్సిన అంశం .

English summary
YSR's political legacy, an independent decision like Jagan's, are her strengths behind the Sharmila's own party in the Telangana politics. YS Rajasekhar Reddy Mannerism, dexterity, language style and leadership qualities are what Sharmila has in common, these are the plus points to sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X