హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ షురూ.. వైఎస్ షర్మిల పాదయాత్ర పున:ప్రారంభం..

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఇవాళ పునఃప్రారంభం అవనుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో 21వ రోజున పాదయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నల్లొండ జిల్లా కొండపాకోనిగూడెంలో పాదయాత్రను ఆపివేశారు. ఈ రోజు మళ్లీ అదే గ్రామం నుంచి పాదయాత్రను షర్మిల పునఃప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో గల తన కార్యాలయం నుంచి షర్మిల బయల్దేరారు.

ఇదీ షెడ్యూల్..

ఇదీ షెడ్యూల్..


మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమె కొండపాకోనిగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 22వ రోజు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5 గంటలకు నార్కట్ పల్లికి చేరుకుంటారు. అనంతరం 6.15 గంటలకు మాడ ఎడవల్లి, ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకుని స్థానికులతో మాట్లాడతారు. దీంతో ఇవాల్టి పాదయాత్ర ముగుస్తుంది. రాత్రికి పోతినేనిపల్లి క్రాస్ లోనే షర్మిల బస చేస్తారు.

మోసం.. వంచన

మోసం.. వంచన


అంతకుముందు షర్మిల మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామ‌‌‌‌కాలు కల్పించ‌‌‌‌డంలో కేసీఆర్ ప్రభుత్వం అడుగ‌‌‌‌డుగునా ఫెయిల్ అయింది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేవని ఎంతో మంది నిరుద్యోగులు తనువు చాలించారు. రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటివి అమలు కావడం లేదు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. గ్రామాలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోంది. మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని వైఎస్ ఆర్​టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

Recommended Video

YS Sharmila is preparing to hold official party meetings from now
21 రోజుల పాటు కొనసాగి.. తిరిగి ఇవాళ స్టార్ట్

21 రోజుల పాటు కొనసాగి.. తిరిగి ఇవాళ స్టార్ట్


షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేవెళ్ల నుంచి 2021 అక్టోబర్ 20వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. 21 రోజుల పాటు పాదయాత్రను కొనసాగించారు. మ‌‌‌‌ధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా వల్ల 2021 నవంబరు 9న వాయిదా వేశారు. 21 రోజుల్లో ఏడు నియోజకవర్గాల్లోని 15 మండ‌‌‌‌లాలు, 5 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో 237.4 కిలోమీట‌‌‌‌ర్ల పాదయాత్ర చేశారు. ప్రజాప్రస్థానం యాత్ర నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి ప్రారంభం కానుంది.

English summary
ysrtp chief ys sharmila will start the padayatra from today. yatra resumed nalgonda district kondapakonigudem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X