వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన రాణిఖేత్ ఎక్స్ ప్రెస్, పక్కకి ఒరిగిన 10 బోగీలు

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో రాణిఖేత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రాజస్థాన్: రాజస్థాన్ లోని జైసల్మేర్ లో రాణిఖేత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 బోగీలు పక్కకి ఒరిగాయి.

అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే థాయాట్ హమీరా ప్రాంతంలో ఇది జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.

10 coaches of Ranikhet Express derail, no casualties

ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందగానే రైల్వే సీనియర్ అధికారుల బృందం ప్రమాద స్థలికి చేరుకొని విచారణ ప్రారంభించింది.

పట్టాల వద్దనే ఏదో సమస్య ఏర్పడి ఉంటుందని, అదే బోగీలు పట్టాలు తప్పడానికి కారణమై ఉంటుందని అధికారులు తమ ప్రాథమిక పరిశీలనలో నిర్ధారించారు. పట్టాలు తొలగిన కంపార్ట్ మెంట్ల లోని ప్రయాణికులను వెంటనే మరో ప్రత్యేక రైలులో వారి గమ్య స్థానాలకు తరలించారు.

English summary
Ten coaches of Ranikhet Express derailed in Rajasthan’s Jaisalmer, officials said on Saturday. Train 15014 Kath Godham-Jaisalmer Express derailed with ten coaches between Thayat Hamira-Jaisalmer at 23.16 hours last night, a statement said. However, no casualties or major injuries were reported, said Railways North West region spokesperson Tarun Jain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X