వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలు రిజైన్: విజయకాంత్‌కి జయలలిత ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ నటుడు విజయకాంత్‌కు గట్టి షాక్ తగిలింది. ఆయనకు సొంత పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం సభాపతికి అందజేశారు.

అందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డిఎండికె పార్టీకి చెందిన వారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షనేత హోదాను విజయ్ కాంత్ కోల్పోయినట్లు స్పీకర్ ధనపాల ప్రకటించారు. వచ్చే మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పలు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయమై విజయ్ కాంత్ తన నిర్ణయం ఇంతవరకూ ప్రకటించకపోవడంతో కూటమి ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు ఝలకిచ్చారు.

10 dissident MLAs submit resignation to Speaker

జయలలిత భార్య వ్యాఖ్యలు కారణమా?

కాంచీపురంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డిఎండికె అధ్యక్షులు విజయకాంత్ సతీమణి ప్రేమలత విలేకరులతో మాట్లాడుతూ... ఎంజీఆర్ వరుసగా మూడుసార్లు సీఎం అయ్యారని, అలా సీఎం జయలలిత ఎందుకు కాలేకపోయారని ప్రశ్నించారు. సీఎం జయలలిత 234 స్థానాలకు నేరుగా అభ్యర్థులను ప్రకటించగలరా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను జయలలిత ఆగ్రహానికి కారణం కావొచ్చంటున్నారు.

విజయకాంత్ తీరు పైన కూడా పలువురు సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆయన సొంత పార్టీ నేతల పైన చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరోవైపు, రాజీనామా చేసిన పదిమంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకె పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయలలిత పార్టీలో చేరేందుకే వారు రాజీనామా చేశారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇది విజయకాంత్‌కు గట్టి షాక్ అని చెప్పవచ్చు.

English summary
Ten dissident MLAs in the Tamil Nadu Assembly, including eight from the main opposition DMDK, today tendered their resignation to Speaker P Dhanapal, a move which comes ahead of the Assembly elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X