ఈ 10 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వరసగా 5 రోజులు
నైరుతి రుతుపవనాలతో దక్షిణ, ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూలై 8వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహిలో వర్షపాతం ఉంటుందని వివరించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వివరించింది.
మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్, ఒడిశాలో అతి భారీ వర్షాలు ఉంటాయి. 8,9వ తేదీల్లో విదర్భ, చత్తీస్ గఢ్‌లో ఎఫెక్టు ఉంటుంది. 9వ తేదీ నుంచి జమ్ముకశ్మీర్, లడాఖ్‌లో.. 11, 12వ తేదీల్లో పంజాబ్‌లో ప్రభావం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీలో 10వ తేదీ నుంచి వర్షపాతం ఉంటుంది.

Recommended Video
అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో 9వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్‌లో ప్రభావం ఉంటుందని పేర్కొన్నది.












Click it and Unblock the Notifications