గ్రెనెడ్లతో విరుచుకుపడిన ఉగ్రవాదులు: 12 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బుధవారం ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడటంతో 12 మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
పుల్వామాలోని కకపురా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడ్డారని, అయితే, అది తప్పిపోయి రోడ్డుపై పేలిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఎవరూ కూడా గాయాలపాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే పాక్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ముగ్గురు భారత సైనికులు, ముగ్గురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద ఆయుధ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తేలికపాటి క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 8-10 వరకు పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications