కొత్త పుంతలు తొక్కిన స్మగ్లింగ్: డిటర్జెంట్ ప్యాకెట్లలో గోల్డ్
చెన్నై: స్మగ్లింగ్‌కు కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నా, స్మగ్లర్లు మాత్రం కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులో స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాకుండా డిటర్జెంట్ ప్యాకెట్లలో బంగారం బిస్కెట్లను అక్రమ రవాణా మొదలు పెట్టారు.
వివరాల్లోకి వెళితే డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో 12 కేజీల బంగారం బిస్కెట్లు పెట్టి మలేసియా నుంచి శ్రీలంకలోని కొలంబో మీదుగా తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టుకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

స్మగ్లర్ల ముఠాకి చెందిన స్థానిక సభ్యులు డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్ల సరుకు కంటైనర్‌ను పోలిన మరో కంటైనర్‌ను సిద్ధంగా ఉంచారు. సరుకుతో వచ్చిన కంటైనర్‌ను తప్పించి పోర్టు అధికారుల తనిఖీకి ఈ కంటైనర్‌ను పంపేలా ఏర్పాటు చేశారు.
ఇంతలో పోలీసులు వారి వ్యవహారాన్ని కనిపెట్టి, ఒరిజనల్ కంటైనర్‌ను పట్టేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications