తెగబడిన మావోయిస్టులు, దాడుల్లో 12 మంది మృతి
రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు తెలగబడ్డారు. శనివారంనాడు మావోయిస్టులు రాష్ట్రంలో రెండు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 12 మంది మరణించినట్లు సమాచారం. ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును బీజాపూర్ జిల్లా కేతుల్నార్ వద్ద మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మందుపాతర పెట్టి పేల్చేశారు. ఆ ఘటనలో ఏడుగురు ఎన్నికల అధికారులు మరణించినట్లు అధికార వర్గాలు చెప్పారు.
మరోదాడిలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై నక్సలైట్లు దాడి చేశారు. ఈ సంఘటన దార్భా వద్ద జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా మరణించాడు.

మృతుల సంఖ్య పెరగవచ్చునని పోలీసులు అధికారులు అంటున్నారు. భద్రతా కారణాల వల్ల పోలింగ్ అధికారులు రాత్రుల్లో ప్రయాణించడాన్ని మానుకుంటారు. పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును మందుపాతరతో పేల్చిన తర్వాత నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపించారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి హెలికాప్టర్ రంగంలోకి దిగింది. బస్తర్ లోకసభ నియోజకవర్గానికి ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications