వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:12 ఏళ్ల చిన్నారి, 2 రోజులు..100 కిలోమీటర్లు కాలినడకన పయనం, సొమ్మసిల్లి..

|
Google Oneindia TeluguNews

పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వచ్చిన వారికి సరైన పనిలేదు. లాక్‌‌డౌన్ రెండోసారి పొడిగించడంతో ఇక్కడేం చేయాలని ఆలోచించారు. బస్సులు లేవు.. అని కాళ్లకు పనిచెప్పారు. ఒకటి కాదు రెండు కాదు 100 కిలోమీటర్లు ప్రయాణించారు. కాసేపు ఓపిక తెచ్చుకుంటే బాగుండేది. కానీ ఆ 12 ఏళ్ల బాలిక చెట్టు, పుట్టల్లో.. అడవీగుండా నడిచి ఆలసిపోయింది. తన తల్లిదండ్రులను కడుపుకోతను మిగులుస్తూ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది.

 ఒక్కగానొక్క కూతురు..

ఒక్కగానొక్క కూతురు..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన ఆండొరాం, సుకమతి మడ్కం గిరిజన దంపతులు. వీరి ఒక్కగానొక్క కూతురు జమలో మడ్కం. సుకమతి దంపతులు అటవీలో ఉత్పత్తులు సేకరించి జీవించేవారు. అయితే వీరి కూతురు తొలిసారి కూలీ కోసం బయల్దేరింది. ఆ రోజు తమ కూతురిని తల్లిదండ్రులు చివరిచూపు చూశారు. రెండునెలల క్రితం ఉఫాధి కోసం 13మందితో కలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చారు. వీరిలో 8 మంది మహిళలు కాగా.. ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇక్కడ మిరప పంటను సేకరించి జీవిస్తున్నారు. అయితే కరోనా వైరస్ క్రమంగా ప్రభావం చూపడంతో వారికి పనిలేకుండా పోయింది.

లాక్‌డౌన్ వల్ల లేని పని..

లాక్‌డౌన్ వల్ల లేని పని..

లాక్‌డౌన్ మరోసారి పొడిగించడంతో ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన కూలీలకు పనిలేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు. రవాణా కూడా లేకపోవడంతో.. తమ ఇంటికి కాలినడకన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన 13 మంది బయల్దేరారు. అడవీ గుండా వారి పర్యటన సాగింది. 100 కిలోమీటర్లు ప్రయాణించాక జమలో మడ్కం అనారోగ్యానికి గురైంది. పక్కన ఉన్నవారు ఆమెను చూసి.. ఆస్పత్రికి తీసుకెళదామని అనుకునేలోపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు చనిపోయింది. బీజాపూర్‌కు 11 కిలోమీటర్ల దూరంలో చిన్నారి కన్నుమూసింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని అనుకునేలోపే చనిపోవడం విషాదం నింపింది.

ఫోన్ బ్యాటరీ డెడ్..

ఫోన్ బ్యాటరీ డెడ్..

శనివారం ఉదయం బీజాపూర్ సరిహద్దుకు బృందం చేరుకుంది. ఈ లోపు ఘటన జరిగింది. జరిగిన విషయం పేరంట్స్‌కు చెప్పే పరిస్థితి కూడా లేదు. వారి వద్ద ఉన్న ఒక ఫోన్ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. దీంతో వారు భాందర్ పాల్ గ్రామానికి చేరుకున్నాక.. ఒకరి సాయం తీసుకున్నారు. అయితే స్థానికులు మాత్రం పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన వెంటనే వైద్యులు అక్కడికి చేరుకున్నారు. వారిని భాండర్ పూల్ గ్రామ శివారులో గుర్తించామని.. మిగతా వారిని క్వారంటైన్ తరలించామని బీజాపూర్ మెడికల్ అధికారి డాక్టర్ బీఆర్ పుజారి తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని మార్చురికి తరలించారు. అంతకుముందు ఆమెకు కరోనా వైరస్ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. మరునాడు తల్లిదండ్రులను పిలిచి చిన్నారి మృతదేహం అందజేశారు. అలసటతో, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతతో చిన్నారి చనిపోయింది అని మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు.

 రూ.1 లక్ష సాయం..

రూ.1 లక్ష సాయం..

ఇప్పుడే కాదు ప్రతీ ఏటా ఛత్తీస్ గఢ్ నుంచి మిరపపంట కోసేందుకు కూలీలు తెలంగాణ వస్తుంటారు. ఈ సారి పెరూర్ గ్రామానికి తన కూతురు వచ్చిందని ఆండొరాం తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు అక్కడే పనిచేసి.. బయల్దేరారని తెలిపారు. లాక్ డౌన్ వల్ల పనిలేకపోవడంతో.. ఇంటికి రావాలని నిశ్చయించుకొని బయల్దేరారని గుర్తుచేశారు. కానీ ఇంతలోనే తమ ఇంటి దీపం ఆరిపోయిందని బోరుమని విలపించాడు. చిన్నారి మృతిపై సీఎం భూపెశ్ భాగల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు.

Recommended Video

Lockdown : AP CM YS Jagan Urges Muslims To Do Ramzan Prayers @ Home

English summary
Jamalo Madkam, 12, left her house for the first time two months ago, going with some relatives and friends to work at a chilli farm in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X