ఐఎస్ఐఎస్ లో 13 మంది భారతీయులు
న్యూఢిల్లీ: నరరూప రాక్షసులకు మారుపేరైన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదుల్లో 13 మంది భారతీయులు చేరారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అందులో ఆరుగురు ఇప్పటికే మరణించారని వెల్లడించాయి.
ప్రస్తుతం ప్రాణాలతో 7గురు ఉన్నారని తెలిపారు. వారిలో ఒక్కరే యుద్దంలో ఉన్నారని, మిగిలిన ఆరుగురు వంటవాళ్లుగా, డ్రైవర్లుగా, హెల్పర్లుగా పని చేస్తున్నారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గత 18 నెలలలో ఈ 13 మంది ఐఎస్ఐఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకుల బృందంలోని ఇద్దరు గత మే నెలలో భారత్ వదిలి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరారు. మిగిలిన ముగ్గురు సింగపూర్, ఒమన్, ఆస్ట్రేలియాల నుండి ఐఎస్ఐఎస్ లోకి వెళ్లారని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం వీరందరూ అక్కడే ఉన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముప్పుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రల అధికారులతో అత్యవసరంగా ఓ ఉన్నత స్థాయి సమావేశం ఎర్పాటు చేస్తున్నది.












Click it and Unblock the Notifications