ప్రభుత్వాలను కూల్చేస్తూ..రాజ్యాంగ వేడుకలు నిర్వహించడమా: 14 పార్టీలు బాయ్‌కాట్: వైసీపీ హాజరు
న్యూఢిల్లీ: ఇవ్వాళ రాజ్యాంగ దినోత్సవం. దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఉంటుంది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు రాజ్యంగ దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓంబిర్లా కూడా ప్రసంగిస్తారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కూటమి బహిష్కరించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న పలు పార్టీలు ఈ వేడుకలకు దూరం అయ్యాయి. తాము పాల్గొనట్లేదని ప్రకటించాయి. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసిందే బీజేపీయేనని మండిపడుతున్నాయి.
రాజ్యాంగానికి ఆయువుపట్టుగా ఉండే సెక్యులరిజాన్ని బీజేపీ వైఖరి గొడ్డలిపెట్టుగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కిన బీజేపీ.. రాజ్యాంగ ఉత్సవాలను నిర్వహించడం హాస్యాస్పదమంటూ భగ్గుమంటోన్నాయి. కాంగ్రెస్ సహా 14 ప్రతిపక్ష పార్టీలు ఈ వేడుకలను బాయ్‌కాట్ చేసినట్లు ప్రకటించాయి. తాము పాల్గొనట్లేదని ఉమ్మడిగా వెల్లడించాయి.
కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఈ వేడుకలను బహిష్కరించాయి. రాజ్యంగ విలువలను పాటించని పార్టీలు ఈ వేడులను నిర్వహించడం అవమానకరమని ఆయా పార్టీల అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులెవరూ పాల్గొనబోరని తెలిపారు.

కాగా- దేశ రాజకీయాల్లో తటస్థ పార్టీలుగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్.. ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటిస్తూ వస్తోన్నాయా పార్టీలు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తూ వస్తోన్నాయి. అదే ఉద్దేశంతో- ఇవ్వాళ్టి రాజ్యాంగ వేడుకలకు హాజరు కానున్నాయి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications