14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు సుప్రీం ఓకే

అహ్మాదాబాద్: అత్యాచార బాధితురాలికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గుజరాత్‌లో అత్యాచారనికి గురైన ఓ బాలిక గర్భవతి అయింది. ఈ క్రమంలో తన కూతురికి అబార్షన్ చేయించేందుకు అనుమతించాలంటూ బాధితురాలి తండ్రి గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఇందుకు కోర్టు నిరాకరించింది.

గర్భవతై 20 వారాల దాటిన తర్వాత భారత శిక్షా స్మృతి ఇలాంటి వాటికి అంగీకరించిందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. దీంతో చేసేదేమి లేకా బాధితురాలి తండ్రి సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి వాదనకు అంగీకరించిన సుప్రీం కోర్టు, అబార్షన్ చేస్తే బాలికకు ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాన్ని తేల్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన వైద్యబృందాన్ని నియమించింది.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన బృందం అబార్షన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని గురువారం నాడు తేల్చిచెప్పింది. దాంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆమెకు అబార్షన్ చేయనున్నారు.

14-year-old rape victim seeks SC permission to abort

బాలికపై దాడి జరిగిందిలా?

10వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలిక టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న తరుణంలో వైద్యం నిమిత్తం ఓ వైద్యుడిని సంప్రదించగా అతడు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బాలిక అబార్షన్‌కు అనుమతించాలంటూ ఆమె తండ్రి కోర్టులో పిటిషన్ వేశారు.

దీనిని విచారించిన గుజరాత్ హైకోర్టు పిటిషన్‌ను బాలిక అబార్షన్‌కు చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. ప్రసవం పూర్తయ్యేవరకు ఆమె మంచిచెడులు చూసుకోవాలని, పరిహారంగా ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+