డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

రోహతక్:జైలు నుండే డేరా బాబా తన భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకొంటున్నారు. డేరా సచ్ఛా సౌధను తన గుప్పిట నుండి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. డేరాను నిర్వహించే బాద్యతలను తన కొడుకు జస్మీత్ సింగ్ ఇన్సాన్ నామినేట్ అయ్యేలా వ్యూహరచన చేశారు. ఈ విషయాన్ని డేరా బాబా తల్లి నసీబ్ కౌర్ ప్రకటించారు.

డేరా బాబా: భక్తుల కోసం డ్రింక్, కానీ...47 నియమాలు తప్పనిసరి

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో జైలులో శిక్షను అనుభవించిన డేరాబాబా రామ్‌రహీమ్ సింగ్‌ను కలిసేందుకు ఇంతవరకు ఆయన కుటుంబసభ్యులు ఎవరూ కూడ జైలుకు రాలేదు.అయితే 15 రోజుల తర్వాత గురువారం సాయంత్రం డేరాబాబా తల్లి నసీబ్ కౌర్ బాబాను కలుసుకొందని అధికారులు ప్రకటించారు. డేరా సచ్ఛాసౌధలో పరిస్థితులపై బాబా ఆరా తీశారు.

కీలకమైన హర్డ్‌డిస్క్ స్వాధీనం, బాబా వీడియోలేనా?

జైలులో ఉన్న రామ్‌రహీమ్‌సింగ్‌ తనను కలిసేందుకు సుమారు 10 మంది సభ్యుల జాబితాను జైలు అధికారులకు అందించారు. ఈ సమాచారాన్ని జైలు అధికారులు పోలీసులకు పంపారు.

ఈ కుటుంబసభ్యుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.ఎట్టకేలకు గురువారం సాయంత్రం రామ్‌రహీమ్ సింగ్ తల్లి నసీబ్ కౌర్ జైలులో ఉన్న డేరాబాబాను పరామర్శించారు. డేరాలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు చర్చించారు.

డేరాలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసిన బాబా

డేరాలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసిన బాబా

డేరా సఛ్చా సౌధలో ఏం జరుగుతోందంటూ రామ్ రహీమ్ సింగ్ తల్లి నసీబ్ కౌర్‌ను ఆరా తీశారు. అరెస్టైన తర్వాత ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయనే విషయాలపై బాబా తల్లిని అడిగారు.అయితే ఆశ్రమంలో అంత బాగానే ఉందని కొడుకు రామ్ రహీమ్ సింగ్‌కు నసీబ్ కౌర్ చెప్పారని సమాచారం. అరెస్ట్ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడ చర్చించారనే ప్రచారం సాగుతోంది.

రామ్ రహీమ్ కొడుకే డేరాకు వారసుడు

రామ్ రహీమ్ కొడుకే డేరాకు వారసుడు

డేరా సఛ్చా సౌధలో తన అధిపత్యాన్ని కోల్పోకుండా రామ్‌రహీమ్‌సింగ్ జాగ్రత్తలు తీసుకొంటున్నారని సమాచారం. సచ్ఛా సౌధలో నెలకొన్న పరిస్థితులో జైలుకు వచ్చిన తల్లి నసీబ్ కౌర్‌తో రామ్‌రహీమ్ సింగ్ చర్చించారు. డేరాబాబా వారసుడిగా ఆయన కొడుకు జస్మిత్‌సింగ్‌ను నామినేట్ చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. అయితే ఈ విషయమై అవసరమైన చర్యలను తీసుకోవాలని డేరా సచ్ఛా సౌధ యాజమాన్యాన్ని నసీబ్ కౌర్ కోరారు. అయితే జైలుకు వెళ్ళిన తర్వాత తొలిసారిగా జైలులో డేరాబాబాను కలుసుకొన్నారు నసీబ్ కౌర్. డేరాబాబా కుటుంబం నుండి వచ్చి ఆయనను కలిసిన తొలి వ్యక్తి నసీబ్ కౌర్ మాత్రమే.

విపాసన ఏం చెప్పిందంటే?

విపాసన ఏం చెప్పిందంటే?

డేరా సచ్ఛా సౌధ ఛైర్ పర్సన్ విపాసన ఇన్సాన్ మాత్రం అందుకు బిన్నంగా స్పందించారు రామ్‌రహీమ్ సింగ్ మాత్రమే డేరా సచ్ఛా సౌధ హెడ్‌గా కొనసాగుతారని ప్రకటించారు. అయితే రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ డేరా సచ్ఛా సౌధకు హెడ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో విపాసన ఈ రకమైన ప్రకటన చేయడం గమనార్హం.

వారంలో రెండు దఫాలు అనారోగ్యానికి గురైన డేరాబాబా

వారంలో రెండు దఫాలు అనారోగ్యానికి గురైన డేరాబాబా

జైలులో ఉన్న డేరా బాబా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నారు వారంలో రెండు దఫాలు డేరా బాబా అనారోగ్యానికి గురయ్యారడని జైలు అధికారులు తెలిపారు.పిజిఐఎంఎస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్యుల బృందం డేరాబాబాను పరీక్షించిందని జైలు అధికారులు ప్రకటించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళి బాబాకు వైద్యం అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స?

ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స?

ఈ మేరకు ప్రభుత్వం పిజిఐఎంఎస్ ఇనిస్టిట్యూల్ అధికారులకు లేఖ రాసిందని విశ్వసనీయవర్గాల సమాచారం.ఈ సమాచారం మేరకు ఈ ఆసుపత్రిలో డేరాబాబాకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే డేరాబాబాను ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే భద్రతా పరమైన చర్యలపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Even as 15 days have passed since he was brought in Rohtak’s Sunaria jail, rape convict Dera chief Gurmeet Ram Rahim has had no visitors so far from his family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి