గుప్తనిధుల కోసం చిన్నారి బలి: నిందితుల్లో తండ్రి, అరెస్ట్

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని గుల్బర్గా ఎస్పి అమిత్ సింగ్ తెలిపారు. వీరిలో హతురాలి తండ్రి కూడా ఉన్నాడని చెప్పారు. ఫిరోజాబాద్ కోటలో గుప్తనిధిని వెలికితీయాలన్న కోరికతోనే ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు.
హతురాలి తండ్రి బీహార్‌కు చెందిన వాడని, అతను ఫిరోజాబాద్ మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నాడని, ఈ కేసులో తొలుత అతడిని అమాయకుడిగా భావించామని, అయితే ఈ నేరంలో అతని ప్రమేయం కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలడంతో ఇతర నిందితులతో పాటు అతడిని కూడా అరెస్టు చేశామని ఎస్పి తెలిపారు.
ఇదిలావుంటే, ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో మృతిచెందాడని, దీంతో ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించినట్టు అమిత్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, మే 22న చిన్నారి అదృశ్యమైందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 26న ముక్కలు చేయబడిన చిన్నారి మృతదేశం నిందితుడు, బాలిక తండ్రి ఇంటి సమీపంలోనే లభ్యమైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాలిక తండ్రితోపాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications