ఐదు కేజీల బంగారం కోసం: కుమార్తె ను బలి ఇచ్చి, శవాన్ని రేప్ చేసి, నాలుక కోసి, నిప్పంటించి !

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: బంగారు నగలు, నగదు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు ? అనే చెప్పడానికి ఓ ఉదాహరణ ఇది. బంగారు నగల కోసం కన్న కుమార్తె ను చంపేసి ఆమె మీద అత్యాచారం చేసినా పట్టించుకోరని, చూస్తూ ఉండిపోయే కసాయి తల్లిదండ్రులు ఉంటారని ప్రపంచానికి తెలిసింది.

అంత దారుణంగా ఉండే తల్లిదండ్రులు ఎక్కడో లేరని భారతదేశంలోనే ఉన్నారని వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు కేవలం 122 కిలోమీటర్ల దూరంలోనే ఆ కసాయి తల్లిదండ్రులు ఉన్నారని పోలీసులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులతో పాటు ఆమెను హత్య చేసిన దొంగ స్వామీజీని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బంగారు నగల షాప్ యజమాని !

బంగారు నగల షాప్ యజమాని !

లక్నోకు 122 కిలోమీటర్ల దూరంలోని కనౌజ్ ప్రాంతంలో మహావీర్ ప్రసాద్, పుష్పా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కవితా (15) అనే కుమార్తె ఉంది. మహావీర్ ప్రసాద్ సొంతంగా బంగారు నగల షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి వ్యాపారంలో చాల నష్టం వచ్చింది.

వ్యాపారంలో నష్టం వస్తే !

వ్యాపారంలో నష్టం వస్తే !

మహావీర్ ప్రసాద్ కు వ్యాపారంలో నష్టం వచ్చింది. గతంలో తన దగ్గర కారు డ్రైవర్ గా పని చేసి ప్రస్తుతం స్వామీజీ అవతారం ఎత్తిన కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిని ఇంటికి రమ్మని చెప్పాడు. తాను మళ్లీ వ్యాపారంలో లాభాలు చూడాలంటే ఏమైనా ఒకటి చెయ్యాలని అతనికి చెప్పాడు.

స్వామీజీని కలిస్తే !

స్వామీజీని కలిస్తే !

కారు డ్రైవర్ కృష్ణ ప్రసాద్ అలియాస్ స్వామీజీ ఇచ్చిన సలహాలు పాటించాలని మహావీర్ ప్రసాద్ ఓ నిర్ణయానికి వచ్చాడు. నేను నమ్మిన దైవశక్తికి మీ కుమార్తెను బలి ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే ఐదు కేజీల బంగారు నగలు మీకు దక్కుతాయని ఆ స్వామీజీ కృష్ణ ప్రసాద్ మహావీర్ ప్రసాద్ కు చెప్పాడు.

కూల్ డ్రింక్ లో మత్తు మందు

కూల్ డ్రింక్ లో మత్తు మందు

మహావీర్ ప్రసాద్, పుష్పా దంపతులుకు స్వామీజీ కృష్ణ ప్రసాద్ చెప్పిన మాటలు నమ్మారు. కుమార్తె కవితకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. అర్దరాత్రి స్వామీజీ చెప్పిన కాళికాదేవి దేవాలయం ఉన్న ప్రాంతానికి కారులో కుమార్తె కవితను తీసుకెళ్లారు.

కళ్ల ముందే రేప్ చేసినా !

కళ్ల ముందే రేప్ చేసినా !

దేవాలయం దగ్గర స్వామీజీ కృష్ణ ప్రసాద్ తల్లిదండ్రుల ముందే కవితను నగ్నంగా తయారు చేశాడు. తరువాత స్పృహలో లేని కవిత గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిన కవిత (శవం) మీద మూడు సార్లు అత్యాచారం చేశాడు. కళ్ల ముందే కన్న కూతురిని చంపేసి శవం మీద అత్యాచారం చేస్తున్నా కనీసం వారు అడ్డుకోకుండా చోద్యం చూశారు.

నాలుక కోసి బలి ఇచ్చారు

నాలుక కోసి బలి ఇచ్చారు

కవిత శవం మీద అత్యాచారం చేసిన స్వామీజీ కృష్ణ ప్రసాద్ చివరికి ఆమె నాలుక కోసి రక్తం కాళికాదేవి విగ్రహం మీద చల్లాడు. అనంతరం కవిత మృతదేహాన్ని అలంకరించి కాళికాదేవి విగ్రహం ముందు నిప్పంటించి దహనం చేశారు.

బంగారు నగలు చిక్కలేదని !

బంగారు నగలు చిక్కలేదని !

తన కుమార్తె కవితను కాళికాదేవీకి బలి ఇచ్చినా ఐదు కేజీల బంగారు నగలు చిక్కకపోవడంతో మహావీర్ ప్రసాద్, పుష్పా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణ ప్రసాద్, కవిత తల్లిదండ్రులు మహావీర్ ప్రసాద్, పుష్పా దంపతులను అదుపులోకి తీసుకున్నారు. 60 శాతం కాలిపోయిన కవిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్యపరీక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 15-year-old girl was killed by a self-declared exorcist and raped her dead body in Uttar Pradesh's Kannauj. The parents of the girl were told they would get 5kg gold if they allow him to perform the ritual.
Please Wait while comments are loading...