ఎంబిఎ విద్యార్థి హత్య: 17 మంది పోలీసులు దోషులు

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం బూటకపు ఎన్‌కౌంటర్‌లో 22 ఏళ్ల ఎంబిఎ గ్రాడ్యుయేట్‌ను హత్య చేసిన కేసులో సిబిఐ కోర్టు 17 మంది ఉత్తరాఖండ్ పోలీసులను దోషులుగా తేల్చింది. హత్య, సాక్ష్యాలను తుడిచిపెట్టడం, క్రిమినల్ కుట్రల కింద కోర్టు వారిని దోషులుగా తేల్చింది.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - 2009 జులైలో ఘజియాబాద్‌కు చెందిన రణబీర్ సింగ్ అనే ఎంబిఎ విద్యార్థి డెహ్రాడూన్‌లోని మోహని రోడ్డులో పోలీసు కాల్పుల్లో మరణించాడు. బలవంతపు వసూళ్ల ముఠాలో ఆ విద్యార్థి ఉన్నాడని పోలీసులు ఆరోపించారు.

17 Cops Convicted for Killing MBA Graduate in Dehradun in 2009

కేసు దర్యాప్తును తొలుత రాష్ట్ర సిబి - సిఐడి చేపట్టింది. ఆ తర్వాత కేసును సిబిఐకి బదిలీ చేశారు. ఈ కేసులో 18 మంది పోలీసులపై ఆరోపణలు చేశారు. వారిలో ఒకతను మాత్రం సాక్ష్యాలు రూపుమాపినందుకు మాత్రమే దోషిగా తేలాడు.

ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే కొంత మంది పోలీసులను అరెస్టు చేశారు. 2012 మరో 11 మంది ఢిల్లీ కోర్టు ముందు లొంగిపోయారు. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు. రణబీర్ తండ్రి రవీంద్ర సింగ్ విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి మార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+