ముంబై పేలుళ్ళ దోషులకు శిక్ష ఖరారు: ఇద్దరికి ఉరిశిక్ష
Recommended Video

ముంబై: 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు సంబంధించిన నిందితులకు టాడా కోర్టు గురువారంనాడు శిక్షను ఖరారుచేసింది. అబూసలేంతో పాటు కరీముల్లాకు టాడా కోర్టు జీవిత ఖైదును విధించింది. తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌లకు ఉరిశిక్ష విధించగా, రియాజ్ సిద్దిఖికీ పదేళ్ళ శిక్ష విధించింది టాడా కోర్టు. మరోవైపు ఎలాంటి ఆధారాల్లేవని అబ్దుల్ ఖయ్యూమ్‌ను నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.

ముంబైలో 1993లో మార్చి 12వ, తేదిన వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో అబూసలేం సహ ఆరుగురిని నిందితులుగా టాడా కోర్టు తేల్చింది.
రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల ముంబైలో వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి.
ఈ పేలుళ్ళ ఘటనలో 257 మంది మృతి చెందారు. 712 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌లకు ఉరిశిక్ష విధించగా, రియాజ్ సిద్దిఖికీ పదేళ్ళ శిక్షను విధించింది కోర్టు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాలు కుట్ర పన్ని దాడికి పాల్పడినట్లు సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం 2007లో విచారణ ముగించింది. అందులో 100 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరైన యాకూబ్ మెమన్‌కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు.
అయితే కేసు విచారణ ముగిసే సమయంలో ముంబయి పేలుళ్లతో సంబంధం ఉందంటూ ముస్తఫా దోసా, అబుసలెం సహా మరో ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో వీరిని ప్రధాన విచారణ నుంచి వేరు చేసి రెండో విడత విచారణ చేపట్టింది టాడా కోర్టు. వీరిలో ఆరుగురిని దోషిగా తేలుస్తూ నేడు శిక్ష విధించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications