Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్కా చెల్లెలి మీద 16 మంది బంధువుల లైంగిక దాడి, ఇద్దరూ మైనర్లే, బాలిక అకస్మిక మృతి, తల్లి లేదని !

చెన్నై: తల్లిదండ్రులు విడిపోవడంతో అవ్వ దగ్గర నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు (మైనర్లు) మీద సొంత బంధువులు 16 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. సుమారు ఏడాదిన్నపాటు అక్కా, చెల్లి మీద లైంగిక దాడి చెయ్యడంతో ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు అమ్మాయిల్లో 7 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న అక్కా, చెల్లి మీద కామంతో లైంగిక దాడి చేసిన మనుషుల రూపంలో ఉన్న జంతువులు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చి జల్సాగా తిరుగుతున్నారు.

 విడిపోయిన తల్లిదండ్రులు

విడిపోయిన తల్లిదండ్రులు

తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తెన్ ర్కుండ్రం గ్రామానికి చెందిన దంపతులకు 9 ఏళ్లు, 7 ఏళ్ల కుమార్తెలు ఉన్నారు. దంపతుల మద్య కుటుంబ గొడవలు ఎక్కువ కావడంతో ఇద్దరూ విసిగిపోయారు. తరువాత దంపతులు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తల్లి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. తండ్రి వేరే మహిళను వివాహం చేసుకున్నాడు.

అవ్వ ఇంటిలో బాలికలు

అవ్వ ఇంటిలో బాలికలు

బాలికల తల్లి ఇద్దరు కుమార్తెలను తన తల్లి ఇంటిలో వదిలిపెట్టింది. అవ్వ సంరక్షణలో ఇద్దరు అమ్మాయిలు పెరుగుతున్నారు. పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న బాలికల తల్లి ఇద్దరినీ తనతో తీసుకెళ్లి అక్కడి స్కూల్ లో చేర్పించింది. అవ్వ ఇంటిలో నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు అక్కడే చదువుకుంటున్నారు.

 బాలికకు అనారోగ్యం

బాలికకు అనారోగ్యం

స్కూలుకు వెలుతున్న బాలికకు కొన్ని నెలలకు ముందు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. స్కూల్ టీచర్లు బాలికను ఆసుపత్రికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరిలోని జష్మర్ ఆసుపత్రి వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేశారు. బాలిక మీద లైంగిక దాడి జరగడం వలనే కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెప్పారు.

తల్లికి అనుమానం !

తల్లికి అనుమానం !

7 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని తెలుసుకున్న ఆమె తల్లి, అవ్వ షాక్ కు గురైనారు. వెంటనే బాలికను ప్రశ్నించగా కామాంధులైన వారి బంధువుల విషయం బయటకు వచ్చింది. వెంటనే అనుమానం వచ్చి బాలిక అక్క ( 9 ఏళ్లు)కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మీద సామూహిక లైంగిక దాడి జరిగిందని తేల్చారు.

 బంధువులే కామాంధులు

బంధువులే కామాంధులు

బాలికల తల్లి, అవ్వ ఫిర్యాదు చెయ్యడంతో విల్లుపురం జిల్లా బ్రహ్మదేశం పోలీసులు కేసు నమోదు చేసి తెన్ ర్కుండ్రం గ్రామానికి చెందిన బాలికల బంధువులు 16 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కామాంధులు అందరూ కోర్టును ఆశ్రయించారు. కామంధులు బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది.

చెన్నైలో బాలికలకు చికిత్స

చెన్నైలో బాలికలకు చికిత్స

బాలిక తల్లి ఇద్దర్నీ చెన్నై తీసుకు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ వారికి వైద్య పరీక్షలు చేయిస్తుంది. రెండు రోజులుగా తనకు కడుపునొప్పిగా ఉందని 7 ఏళ్ల బాలిక చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం బాత్ రూంకు వెళ్లిన బాలిక చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. తనకు కడుపునొప్పి చాలా ఎక్కువగా ఉందని ఆ బాలిక తల్లికి చెప్పింది.

 లైంగిక దాడితోనే బాలిక మృతి

లైంగిక దాడితోనే బాలిక మృతి

వెంటనే బాలికను చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలికకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అయితే బాలిక అకస్మాత్తుగా మరణించింది. తమ కుమార్తెల మీద సామూహిక అత్యాచారం చేసిన 16 మంది కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని బాలికల తల్లి బోరున విలపిస్తోంది. బాలిక శరీరం మీద ఇప్పటికీ గాయాలు ఉన్నాయని, శవపరీక్షలు నిర్వహించిన తరువాత పోస్టుమార్టుం నివేదిక ఇస్తామని వైద్యులు తెలిపారు. బాలిక మృతి చెందడంతో బ్రహ్మదేశం పోలీసులు మరోసారి విచారణ మొదలుపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+