కాలేజీ హస్టల్ లో 20 వేల మారణాయుధాలు స్వాధీనం

Posted By:
Subscribe to Oneindia Telugu

జార్ఖండ్ : కాలేజ్ హస్టల్ లో 20 వేల మారణయుధాలు దొరకడం కలకలం రేపుతోంది. ఈ ఘటన దుమ్కా జిల్లాలో చోటుచేసుకొంది. మారణాయుధాలు కాలేజ్ హస్టల్ కు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

జార్ఘండ్ లోని దుమ్కా జిల్లాలోని ఎస్పీ కాలేజీ బాలుర హస్టల్ లో నాటు తుపాకులు, విల్లులు, బాణాలను, గొడ్డళ్ళను, చాకులు, ఇనుప రాడ్లు కొడవళ్ళె, బాణాలు, బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

20000 weapons seized in college hostel

కాలేజ్ హస్టల్ ఆవరణకు ఈ మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు.నవంబర్ 25వ, తేదిన బంద్ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడేందుకు వీటిని సమకూర్చారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆ మారణాయుధాలు కాలేజీ హస్టల్ కు తెచ్చారనే అనుమానంతో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్సిస్తున్నారు.ఎవరు ఈ మారణాయుధాలను కాలేజ్ హస్టల్ కు తెచ్చారు. వీటిని ఇక్కడ ఎవరు దాచిపెట్టారనే విషయాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
20000 weapons seized in college hostel primeses bihar state. who has recevie weapons, and what purpose for this police enquire each and everything.
Please Wait while comments are loading...