ఒంటరితనం భరించలేక బిబిఏ విద్యార్థిని ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: నగరంలోని హెబ్బాల్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒంటరితనం భరించలేక కెంపాపురలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బీబీఏ చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్యకు పాల్పడిన గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. కేరళకు చెందిన సోఫియాను చూడటానికి కళాశాలకు ఆమె తల్లి శుక్రవారం వచ్చి వెళ్లింది. కూతురు ఫీజు కూడా కట్టింది. కాగా, మరుసటి రోజు సోఫియాతో మాట్లాడేందుకు ఆమె తల్లి హాస్టల్‌కు ఫోన్ చేసింది.

 21-year-old college girl kills self, citing loneliness in Bengaluru

అయితే, శనివారం 2.30గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రూమ్‌మేట్స్ లైబ్రరీకి వెళ్లారు. తిరిగొచ్చి రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.

దీంతో వారు వెంటనే పోలీసులకు, ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా, సోఫియా తన సూసైడ్ నోట్‌లో ఒంటరితనం తనను కుంగదీసిందని, ఎవరూ తనను అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ప్రేమ వ్యవహారం గురించి ఎలాంటి ప్రస్తావన ఆ లేఖలో లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Bengaluru girl studying in a private college committed suicide in her college hostel room on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి